పశ్చిమగోదావరిహోమ్

ఘనంగా ఉయ్యాలవాడ నరసింహారెడ్డి విగ్రహ ఆవిష్కరణ

పశ్చిమ గోదావరి జిల్లా, ఆచంట నియోజకవర్గం , మార్టేరు సెంటర్‌లో ఉయ్యాలవాడ నరసింహారెడ్డి విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా రెడ్డి సంఘం ఆధ్వర్యంలో విగ్రహా ఆవిష్కరణ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా నలుమూలల నుండి రెడ్డి సంఘం నాయకులు , రెడ్లు పెద్ద ఎత్తున హాజరయ్యారు.

ఈ సందర్భంగా భైరెడ్డి ఎర్రయ్య రెడ్డి మాట్లాడుతూ జిల్లాలో ఉయ్యాలవాడ నరసింహారెడ్డి మొట్టమొదటి విగ్రహం ఆవిష్కరించుకోవడం ఎంతో సంతోషకరం అని తెలిపారు. రెడ్డి లో పుట్టినందుకు గర్వపడాలన్నారు. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి వారిని ఆదర్శంగా తీసుకోవాలన్నారు.

రాగాల ప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ విప్లవ వీరుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గారి విగ్రహన్నీ మార్టేరు లో ఆవిష్కరించండం శుభపరిణామం అన్నారు. ఎంతో ఘనత కలిగిన ఆయన విగ్రహాన్ని ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో మొదటిదిగా మార్టేరు నిలుస్తుందన్నారు.

కుముదవల్లి గ్రామం నుండి తమ సంఘ నాయకులు , రెడ్లు పెద్ద సంఖ్యలో విగ్రహ ఆవిష్కరణకు హాజరైనట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాగాల ప్రసాద్ రెడ్డి, భైరెడ్డి ఎర్రయ్య రెడ్డి, నక్క వీరబాబు రెడ్డి, ధర్మాల రామశంకర్ రెడ్డి, రాగాల గోవింద్ రెడ్డి, నీలాపు రామ చంద్ర జగనాధ్ రెడ్డి, నీలాపు రమణ రెడ్డి ,దాసరి జగదీష్ రెడ్డి ,రాగాల మధుసూదన్ రెడ్డి, బస్వ వెంకన్న రెడ్డి, ధర్మాల వెంకటేష్ రెడ్డి , ఉప్పాడ పెద్ది రెడ్డి, రాగాల చిన్న రెడ్డి, వాకాడ నాని రెడ్డి, భైరెడ్డి రాము రెడ్డి,గురివిళ్ల రామకృష్ణ రెడ్డి, రాగాల శ్రీనివాస్ రెడ్డి, ఏసు రెడ్డి, నక్క సూర్యనారాయణ రెడ్డి తదితరులు హాజరైయ్యారు.

సీనియర్ జర్నలిస్ట్ పూడి రామకృష్ణ , పశ్చిమగోదావరి జిల్లా

Related posts

దాససాహిత్య గాయకులకు టీటీడీ నుంచి సువర్ణావకాశం

Satyam News

ఎండ ఉక్కపోత తో మరణాలు: మండుతున్న ఐరోపా

Satyam News

సమ్మెలో పాల్గొన్న 4 లక్షల మంది గిగ్ వర్కర్లు

Satyam News

సోషల్ మీడియాలో తోక ముడిచిన అబద్ధాల ముఠా

Satyam News

ఎబోలా కేసులు నమోదు కాలేదు: మంత్రి రాజనర్సింహ

Satyam News

మాట నిలబెట్టుకున్న లోకేష్…. పేద ముస్లిం ఫ్యామిలీకి రంజాన్‌ కానుక…!!

Satyam News

Leave a Comment