25.2 C
Hyderabad
September 20, 2026
అనంతపురంహోమ్

రైస్ పుల్లింగ్ పేరుతో చీటింగ్ చేసిన వైసీపీ నేత

శ్రీ సత్యసాయి జిల్లాలో రైస్ పుల్లింగ్ పేరుతో కోట్లాది రూపాయల దోపిడీకి పాల్పడుతున్న వైసీపీ కన్వీనర్, రౌడీషీటర్ చింతకుంట కృష్ణా రెడ్డి (అలియాస్ డిక్కీ బాబు)ని పోలీసులు అరెస్ట్ చేశారు.

తలుపుల మండలం వైసీపీ కన్వీనర్‌గా ఉన్న ఇతను, రైస్ పుల్లింగ్ మహిమ గల రాగి చెంబులు తయారు చేస్తానని, వాటిని అమ్మితే రెండు కోట్ల రూపాయల వరకు వస్తాయని నమ్మించి పలువురి వద్ద నుండి భారీగా వసూళ్లకు పాల్పడినట్లు విచారణలో తేలింది.

ఈ దారుణంపై కదిరి డీఎస్పీ శివన్నారాయణ స్వామి వివరాలను వెల్లడించారు. వేణుగోపాల్ రెడ్డి అనే బాధితుడి నుంచి నిందితుడు రెండు విడతలుగా 10 లక్షల రూపాయలు వసూలు చేయడమే కాకుండా, తిరిగి డబ్బులు అడిగినందుకు అతడిని తీవ్రంగా బెదిరించాడు.

దీంతో బాధితుడు తలుపుల పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా, పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిందితుడి నుంచి ఒక ఫార్చునర్ కారు, మూడు సెల్ ఫోన్లు, రూ. 1,08,940 నగదుతో పాటు ఐదు రాగి చెంబులను స్వాధీనం చేసుకున్నారు. రేప్, మర్డర్, కిడ్నాప్, చోరీ వంటి ఏ నేరం జరిగినా అందులో వైసీపీ నేతల హస్తం ఉంటోందని ఈ సందర్భంగా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

ప్రజలు రైస్ పుల్లింగ్ వంటి మూఢనమ్మకాలను నమ్మి మోసపోవద్దని, ఇటువంటి అక్రమాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు

.

Related posts

రేపటిలోగా డీజిల్, పెట్రోల్ సప్లయ్ పెరగాలి

Satyam News

విద్యా రంగంలో భారీ పెట్టుబడులకు సాయం చేయండి

Satyam News

వైసీపీని వణికిస్తున్న చంద్రబాబు ఫినామినా..

Satyam News

రంజాన్ సందర్భంగా రేవంత్ ఇఫ్తార్ విందు

Satyam News

సైఫన్ గేట్లు తెరుచుకున్న సరళాసాగర్

Satyam News

సురుటుపల్లి శ్రీ పల్లికొండేశ్వరస్వామిని దర్శించుకున్న టీటీడీ చైర్మన్

Satyam News

Leave a Comment