శ్రీకాకుళంహోమ్

శ్రీకాకుళంలో ఒక్క సీటు కూడా వైసీపీకి రాదు: తమ్మినేని

#YSJagan

​ఓ వైపు విజయనగరంలో చిన్నశీను పార్టీని వీడడంతో వైకాపా నాయకుల రోదన సభలు ఇప్పటికే వారి మానసిక స్థైర్యాన్ని దెబ్బతీస్తుంటే, మరోవైపు ఉత్తరాంధ్ర చివరన ఉన్న శ్రీకాకుళంలో కూడా వైకాపా సమాధి అవుతోందంటూ ఆ పార్టీ నాయకులే భవిష్యవాణి వినిపిస్తున్నారు.

​తమ్మినేని సీతారాం తనయుడు చిరంజీవి నాగ్ తాజాగా వైకాపా భవిష్యత్తు గురించి చెబుతూ “ఒక్క సీటు కూడా వైసీపీకి రాదు. యస్, మీ సర్వే నివేదికలు తెప్పించుకోండి. తెప్పించుకుని చూడండి ఏ పార్టీకి ఎక్కడ ఏ ఎడ్జ్ ఉందో, ఏ పార్టీ గెలుస్తుందో! ఇలాగే గనక వెళ్తే ఇక్కణ్ణించి ఈ రెండున్నర సంవత్సరాలే కీలకం. ఒక రాజకీయ పార్టీ అంటే ఒక వ్యవస్థ. ఆ వ్యవస్థలో ఒక జిల్లా పాయింట్ ఆఫ్ వ్యూలో మీకేదైనా ఉంటే… పార్టీ అధ్యక్షుడిగా మిమ్మల్ని నియమించారు, పార్లమెంటరీ పార్టీ అధ్యక్షుడిగా నాన్నగారిని నియమించారు.

​మీరు ఒకే క్యాస్ట్ ని బేస్ చేసుకుని రాజకీయం చేయాలనుకుంటున్నారా? ఈ పార్టీని ముందుకు తీసుకెళ్లాలనుకుంటున్నారా? లేదా మిమ్మల్ని నమ్మిన జగన్ మోహన్ రెడ్డి గారిని, ఈ పార్టీని నిట్టనిలువునా ముంచెయ్యాలనుకుంటున్నారా? క్యాండిడేట్‌ను మీరు బలిపశువును చేసుకుంటూ వస్తున్నారు కదా, చేసుకోండి ఎవడొద్దన్నాడు! ఈయనే క్యాండిడేట్, ఇంకెవ్వడూ రాడు అన్న అభద్రతాభావం మీకెందుకు? పార్లమెంటరీ పార్టీ పరిశీలకులకు గానీ ఇవేమీ కనపడటంలేదా? చెవులకు వినపడటంలేదా? అని నేను అడుగుతున్నాను. ఇక్కడ జరుగుతున్న రాజకీయాలు క్యాస్ట్ బేస్ మీదే జరుగుతున్నాయని అందరికీ తెలిసిందే” అంటూ వ్యాఖ్యానించారు.

Related posts

విదేశీ విద్యార్థులకు ట్రంప్ భారీ షాక్

Satyam News

అజిత్ పవార్ విమానం కూలింది ఇలా…

Satyam News

భవిష్యత్తు అవసరాలకే తెనాలి రోడ్డు విస్తరణ

Satyam News

లోకేష్‌కి అదానీ టీవీ మద్దతు…. జగన్‌కి బిగ్‌ షాక్‌..??

Satyam News

శత్రువుకు కూడా సాయం చేసిన లోకేష్‌

Satyam News

తిరుపతి సంస్కృత యూనివర్సిటీలో లైంగికదాడి?

Satyam News

Leave a Comment