26.3 C
Hyderabad
September 19, 2026
ప్రపంచంహోమ్

ఖొమైనీ హత్యకు ప్రతీకారం మా బాధ్యత

#NooriHamdani

ఇరాన్ సుప్రీం లీడర్ ఆయతుల్లా అలీ ఖొమైనీ హత్యకు బదులు తీర్చుకోవాల్సిన అవసరం ఉందని ఇరాన్‌కు చెందిన ప్రముఖ షియా మతపెద్ద ఆయతుల్లా నూరీ హమ్దానీ అన్నారు. ఖామెనీ హత్యకు ప్రతీకారం తీర్చుకోవడం ప్రతి ముస్లింల ధార్మిక బాధ్యత అని ఆయన పేర్కొన్నారు. అమెరికా ఇజ్రాయెల్ దాడుల్లో ఖామెనీ మరణించిన తర్వాత ఇరాన్‌లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది.

ఈ దాడిని ముస్లింలపై జరిగిన పెద్ద దాడిగా అభివర్ణించిన పలువురు షియా మత గురువులు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ముస్లింలు ప్రతీకారం తీర్చుకోవాలని పిలుపునిచ్చారు. దీనికి సంబంధించి కొందరు మతపెద్దలు ఫత్వా (మతపరమైన ఆదేశం) కూడా జారీ చేసినట్లు అంతర్జాతీయ మీడియా తెలిపింది. ఖామెనీ మరణం తర్వాత ఇరాన్ శోకసంద్రంగా మారింది.

ప్రభుత్వం దేశవ్యాప్తంగా సంతాపదినాలు ప్రకటించగా, ప్రజలు పెద్ద ఎత్తున సంతాప సభలు నిర్వహిస్తున్నారు. ఇరాన్ ప్రభుత్వం ఈ ఘటనను “ఇస్లాం ప్రపంచంపై జరిగిన యుద్ధ చర్య”గా పేర్కొంటూ, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.

ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పర్జేస్కైన్ కూడా ఖామెనీ మరణానికి ప్రతీకారం తీర్చుకోవడం దేశానికి హక్కు, బాధ్యత అని అన్నారు. ఇరాన్ విప్లవ గార్డులు కూడా ఈ దాడికి కారణమైన దేశాలు తప్పించుకోలేవని హెచ్చరించారు. ఇదిలా ఉండగా, ఇరాన్‌కు మద్దతుగా కొన్ని దేశాలు స్పందించాయి.

Related posts

హెరిటేజ్‌కి రాయితీలు… అసలు లెక్క ఇది.. తప్పేముంది జగన్‌…?

Satyam News

శ్రీవారి పాదసన్నిధిలో సీఎం చంద్రబాబు కుటుంబం

Satyam News

గిరి బలిజ జీ ఓ రద్దు చెయ్యాలి

Satyam News

ఉస్మానియా యూనివర్సిటీలో డిజిటల్ స్టూడియో

Satyam News

మా హాస్టల్ అధ్వాన్నం: మంచిర్యాల విద్యార్థుల ధర్నా

Satyam News

మమతా బెనర్జీ ప్రభుత్వం డిస్మిస్ చేసిన గవర్నర్

Satyam News

Leave a Comment