26.7 C
Hyderabad
September 20, 2026
కృష్ణహోమ్

బాలల హక్కుల పరిరక్షణ బృహత్తరమైన బాధ్యత 

#CBN

బాలల హక్కుల పరిరక్షణ ఒక బృహత్తరమైన బాధ్యత అని, నిస్వార్ధంగా పిల్లల హక్కుల పరిరక్షణ, ఆరోగ్యం, విద్య, వికాసం కోసం పాటుపడాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు హితవు పలికారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ చైర్ పర్సన్ వేటుకూరి ఏవీఎస్ సూర్యనారాయణ ఎంపికైన కమిషన్ సభ్యులు బాధ్యతలు స్వీకరించిన అనంతరం మర్యాదపూర్వకంగా సీఎం ను కలిశారు.

ఈ సందర్భంగా బాలల హక్కుల పరిరక్షణకు కమిషన్ చేస్తున్న కృషికి ప్రభుత్వం పూర్తి సహాయ సహకారాలు అందిస్తుందని సీఎం భరోసా ఇచ్చారని చైర్ పర్సన్ తెలిపారు. కమిషన్ సభ్యులను ఆత్మీయంగా పలకరించిన ముఖ్యమంత్రి గారు.. నిస్వార్ధంగా బాలల సంక్షేమం, అభ్యున్నతి కోసం కృషిచేసి సమాజానికి ఉత్తమ పౌరులను అందించేలా కమిషన్ పనిచేయాలని ఆకాంక్షించారు.

సీఎంను కలిసిన వారిలో కమిషన్ సభ్యులు ఉండవల్లి గాంధీబాబు, పద్మలత, డాక్టర్ నాగ మానస, డాక్టర్ శ్రీనివాసమూర్తి, మందాల గంగ సూర్యనారాయణ, చల్ల మధుసూదన రావు ఉన్నారు.

Related posts

21 నెలల్లోనే 5.50 లక్షల ఇళ్లు..ఇది కూటమి రికార్డ్!

Satyam News

తల్లి కాబోతున్న కత్రినా కైఫ్

Satyam News

రామ్‌గోపాల్ వర్మ అరెస్టు తప్పదా?

Satyam News

త్రిష ఎంట్రీ తో విజయ్ ఫ్యామిలీ విచ్ఛిన్నం

Satyam News

బార్ పెట్టాలంటే భయపడక్కరలేదు!

Satyam News

తిరుమలలో వైసీపీ రాజ్యం నడుస్తోందా?

Satyam News

Leave a Comment