25.2 C
Hyderabad
September 20, 2026
మహబూబ్ నగర్హోమ్

ఉపాధి అవకాశాలు కల్పించడమే రేవంత్ రెడ్డి ధ్యేయం

#VakitiSrihari

ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం యువత కోసం అహర్నిశలు కృషి చేస్తోందని, ఉపాధి అవకాశాలు కల్పించడమే కాకుండా యువత స్వశక్తితో ఎదగడానికి అనుకూల వాతావరణం సృష్టిస్తోందని యువజన సర్వీసులు, క్రీడల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు.

మహబూబ్‌నగర్‌లో యువజన సర్వీసులు, క్రీడల శాఖ ఆధ్వర్యంలో ప్రజాపాలన–ప్రగతి ప్రణాళికలో భాగంగా 99 రోజుల యాక్షన్ ప్లాన్ కింద మెగా జాబ్ మేళా ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంత్రి శ్రీహరి ముఖ్య అతిథిగా హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించారు.

ఈ సందర్భంగా శాసనమండలి చీఫ్ విప్ పి మహేందర్ రెడ్డి, ఎమ్మెల్యేలు యన్నం శ్రీనివాసరెడ్డి, మధుసూదన్ రెడ్డి, స్పోర్ట్స్ అథారిటీ ఎండీ సోనిబాలదేవితో పాటు పలువురు ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. భారీ స్థాయిలో యువత హాజరై జాబ్ మేళాకు విశేష స్పందన వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా మంత్రి వాకిటి శ్రీహరి మాట్లాడుతూ ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో ఇప్పటివరకు 24,608 మంది విద్యార్థులు నమోదు చేసుకున్నారని తెలిపారు. వారిలో కనీసం 3,500 మందికి ఉద్యోగాలు కల్పించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోందని పేర్కొన్నారు. ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ జాబ్ మేళాలో ఇంటర్వ్యూలు పూర్తి చేసిన వెంటనే ఉద్యోగ ఆర్డర్లు అందుకుంటున్న అభ్యర్థులు ఉన్నారని తెలిపారు.

రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విద్యా రంగాన్ని బలోపేతం చేసి, ఉద్యోగ అవకాశాలను పెంచే దిశగా దృష్టి సారిస్తున్నారని మంత్రి తెలిపారు. ప్రభుత్వానికి విద్యపై స్పష్టమైన చిత్తశుద్ధి ఉందని, ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు పౌష్టికాహారం అందించేందుకు కాస్మోటిక్ చార్జీలను పెంచినట్లు వెల్లడించారు. గత పది సంవత్సరాల పాలనలో సాధ్యంకాని అనేక పనులను ప్రస్తుత ప్రభుత్వం సాధించి చూపిందని, దాదాపు 25 వేల మంది ఉపాధ్యాయులకు పదోన్నతులు ఇవ్వడంతో పాటు బదిలీలు కూడా పూర్తి చేసినట్లు చెప్పారు.

యువజన సర్వీసులు, క్రీడల శాఖ నిర్వహిస్తున్న జాబ్ మేళాలను యువత సద్వినియోగం చేసుకోవాలని మంత్రి పిలుపునిచ్చారు. గతంలో పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పూర్తికాకపోవడంతో ఈ ప్రాంతం వెనుకబడిందని విమర్శించారు. ప్రస్తుతం ముఖ్యమంత్రి నాయకత్వంలో వ్యవసాయం, విద్యారంగాల అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తున్నట్లు తెలిపారు. ఈ మెగా జాబ్ మేళా ద్వారా వేలాది మంది యువతకు ఉపాధి అవకాశాలు లభించే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు.

Related posts

తిరుపతిలో భక్తులకు టీటీడీ వసతి సౌకర్యాలు ఇవే

Satyam News

శివ‌రాత్రి సంద‌ర్బంగా గ‌ట్టి బందోబ‌స్త్‌

Satyam News

శ్రీవారి ఆలయంలో శాస్త్రోక్తంగా దీపావళి ఆస్థానం

Satyam News

మీ సేవ కేంద్రాలతో అత్యుత్తమ డిజిటల్ సేవలు

Satyam News

అంబేద్కర్ కి అవమానం చేసిన వారిపై కఠిన చర్యలు

Satyam News

సర్పంచ్ లకు గుడ్ న్యూస్

Satyam News

Leave a Comment