విజయనగరంహోమ్

శివ‌రాత్రి సంద‌ర్బంగా గ‌ట్టి బందోబ‌స్త్‌

ఈ నెల 15 వ తేదీ మ‌హాశివ‌రాత్రి సంద‌ర్బంగా విజ‌య‌న‌గ‌రం జిల్లాలో ప్ర‌ఖ్యాతి గాంచిన పుణ్య‌గిరి కొండ‌పై శ్రీ ఉమా కోటిలింగేశ్వర స్వామి ఆలయంలో వ‌చ్చే భ‌క్తుల‌కు ఇబ్బంది కల‌గ‌కుండా భ‌ద్ర‌తా ఏర్పాటు చేయాల‌ని ఎస్పీ దామోద‌ర్ మంగ‌ళ‌వారం స్థానిక పోలీసుల‌ను ఆదేశించారు.

ఈ మేర‌కు ఏర్పాటు చేస్తున్న బందోబస్తు, భద్రత ఏర్పాట్లును జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్ స్వయంగా సమీక్షించారు. ఇందులో భాగంగా జిల్లా ఎస్పీ మరియు ఇతర పోలీసు అధికారులు పుణ్యగిరి కొండపైకి వెళ్ళి, శివుడ్ని దర్శించుకొని, పూజలు నిర్వహించారు.

అనంతరం, ఆలయ పరిసరాల్లో క్యూ లైన్లు, భద్రత ఏర్పాట్లును ఏర్పాటు చేసుకోవాలని, ఎక్కువ సిసి కెమెరాలు, లైటింగ్ ఏర్పాటు చేసుకొని వాటిని కంట్రోల్ రూముకు అనుసందానం చేసుకూవాలన్నారు. శివరాత్రి రోజున‌ పుణ్యగిరి , సన్యాసయ్యపాలెంకు సుమారు లక్షన్నర భక్తులు విచ్చేసే అవకాశం ఉన్నందున, సామాన్య భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా బందోబస్తు, భద్రత ఏర్పాట్లు చేసుకోవాలని జిల్లా ఎస్పీ సిబ్బందిని ఆదేశించారు.

విజయనగరం, చుట్టు ప్రక్కల ప్రాంతాల నుండి పుణ్యగిరికి వచ్చే ప్రత్యేక ఆర్టీసి బస్సులను, ఆటోలు మరియు వాహనాలను పార్కింగు చేసేందుకు ప్రత్యేకంగా కేటాయించిన ప్రాంతాల్లోకి అనిమతించి ఎటువంటి ట్రాఫిక్ అంతరాయం కలగకుండా చూడాలని ఆదేశించారు.

ఎస్. కోటలోని నందిత హెూటల్ వెనుక భాగం లోను, పంచాయతీ పార్క్‌, జి.జె. కాలేజ్ గ్రౌండ్‌, ముత్యాలమ్మ దేవాలయం వద్ద ఖాళీ స్థలాలను వాహనాల పార్కింగ్‌ కు కేటాయించామన్నారు. పుణ్యగిరి కొండపైన ప్రధాన ఆలయం, క్యూలైన్లు, పుట్టదార, కోటి లింగాల రేవు, దారగంగమ్మ ప్రాంతాల వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాటులు చేయాలని అధికారులకు జిల్లా ఎస్పీ సూచనలు చేసారు.

భద్రత ఏర్పాట్లును పోలీసు అధికారులు పర్యవేక్షించేందుకు పుణ్యగిరి కొండపైన, కొండ దిగువన తాత్కాలిక కంట్రోల్ రూంలను ఏర్పాటు చేయాలని జిల్లా ఎస్పీ అధికారులను ఆదేశించారు. పుణ్యగిరి మార్గంలోను, ఎస్.కోటలోను ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా వాహనాలను డైవర్టు చేసేందుకు పాయింట్లు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు.

ట్రాఫిక్ రెగ్యులేషన్‌ చేసేందుకు దేవి బొమ్మ జంక్షను నుండి రైల్వే గేటు వరకు, రైల్వే గేటు నుండి పుణ్యగిరి వరకు, ఒన్ వే ట్రాఫిక్ జంక్షను నుండి ప్రకాశం పార్కు వరకు మూడు మూవింగు పార్టీలను ఏర్పాటు చేయాలన్నారు.

ఎగ్జిబిషన్స్ నిర్వహించే రైతు బజారు, ఆకుల డిపోల వద్ద కూడా బందోబస్తు ఏర్పాటు చేయాలని అధికారులను జిల్లా ఎస్పీ ఆదేశించారు.ఎస్పీ వెంట విజయనగరం ఇంచార్జ్‌ డీఎస్పీ ఆర్.గోవిందరావు, ఎస్.కోట సీఐ వి.నారాయణమూర్తి, ఎస్బీ సీఐ ఎ.వి.లీలారావు, ఎస్.కోట ఎస్ఐ, ఆలయ అధికారులు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

Related posts

రాహుల్ గాంధీ దిష్టి బొమ్మ దగ్ధం

Satyam News

ఇరిగేషన్ ప్రాజెక్టులతో జిల్లా సస్యశ్యామలం

Satyam News

పాకిస్తాన్ తో క్రికెట్ ఆడేది లేదు….

Satyam News

వనపర్తి చైర్మన్ పదవి బీసీలకు ఇవ్వాలి: సతీష్

Satyam News

విశాఖకు తరలి వచ్చిన కాగ్నిజెంట్

Satyam News

ఎన్నికల కేసుల నుంచి డి కే అరుణ కు విముక్తి

Satyam News

Leave a Comment