శ్రీకాకుళంహోమ్

గ్రామీణాభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది

రాష్ట్రంలో గ్రామీణ అభివృద్ధికి కూటమి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు అన్నారు. శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట నియోజకవర్గంలో మంత్రి రామ్మోహన్ నాయుడు సుడిగాలి పర్యటన చేశారు. పలు సీసీ రోడ్లు, బీటీ రోడ్లు, బస్ షెల్టర్‌ల ప్రారంభోత్సవాలలో పాల్గొన్నారు.

ఎన్‌ఆర్‌ఈజీఎస్, ఎంపీ లాడ్స్ నిధులతో చేపట్టిన అభివృద్ధి పనుల ను ప్రారంభించారు. పోలాకి మండలం రాళ్లపాడులో రూ.50 లక్షల సీసీ రోడ్డు, రూ.8 లక్షల బస్ షెల్టర్ ప్రారంభం, తెల్లవానిపేట– కాకినాడపేట, బెర్జిపాడు–రెహ్మాన్‌పురం బీటీ రోడ్లను ప్రజలకు అంకితం ఈ కార్యక్రమాలలో ఉన్నాయి.

గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి వెల్లడించారు. ఈ కార్యక్రమాల్లో ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి, జిల్లా అధికారులు, కూటమి నాయకులు, స్థానికులు పాల్గొన్నారు.

Related posts

ట్రంప్ నిర్ణయానికి ఎదురుతిరిగిన ఆ ముగ్గురు….

Satyam News

ఖార్గ్ ద్వీపం చుట్టూ మోహరిస్తున్న అమెరికా దళాలు

Satyam News

ఏపీఎస్‌ఆర్టీసీని ప్రైవేటీకరిస్తే తిరుగుబాటు తప్పదు!

Satyam News

శ్రీవారి పాదసన్నిధిలో సీఎం చంద్రబాబు కుటుంబం

Satyam News

ఏపీకి వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ C4IR కేంద్రం

Satyam News

ఏపీలో ప్రకృతి బజార్‌లు…. ఆర్గానిక్‌ పంటలతో వంటలు

Satyam News

Leave a Comment