ప్రత్యేకంహోమ్

ఏపీకి వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ C4IR కేంద్రం

#WorldEconomicFourm

ప్రపంచ సాంకేతిక రంగంలో ఆంధ్రప్రదేశ్ మరో కీలక మైలురాయిని సాధించింది. వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ (WEF) ప్రకటించిన నాలుగో పారిశ్రామిక విప్లవం (Fourth Industrial Revolution – 4IR)కు సంబంధించిన C4IR (Centre for the Fourth Industrial Revolution) కేంద్రం ఆంధ్రప్రదేశ్‌కు రానుంది. ఈ విషయాన్ని దావోస్ వేదికగా అధికారికంగా ప్రకటించడం రాష్ట్రానికి గర్వకారణంగా మారింది.

ఫ్రాన్స్, యూకే, యూఏఈ (రెండు కేంద్రాలు) వంటి ప్రపంచ స్థాయి దేశాల సరసన భారత్ నుంచి ఆంధ్రప్రదేశ్ ఒక్కటే ఎంపిక కావడం విశేషం. దీంతో ప్రపంచ టెక్నాలజీ మ్యాప్‌లో ఏపీకి ప్రత్యేక గుర్తింపు లభించింది. C4IR కేంద్రం ప్రత్యేకత ఏమిటంటే ఈ కేంద్రం కేవలం ఒక కార్యాలయం మాత్రమే కాదు. భవిష్యత్తు సాంకేతిక అభివృద్ధికి దారి చూపే గ్లోబల్ పాలసీ, ఇన్నోవేషన్ హబ్ గా ఇది పనిచేయనుంది.

ముఖ్యంగా రెండు కీలక రంగాలపై ఈ కేంద్రం దృష్టి సారించనుంది. ఒకటి సైబర్ రెసిలియెన్స్ & కృత్రిమ మేధస్సు (AI). అదేమిటంటే డిజిటల్ యుగంలో పెరుగుతున్న సైబర్ దాడుల నుంచి రక్షణ చర్యలు, అలాగే AI ద్వారా పాలన, వ్యవసాయం, విద్య వంటి రంగాల్లో విప్లవాత్మక మార్పులపై పరిశోధనలు జరుగుతాయి.

అదే విధంగా ఎనర్జీ ట్రాన్సిషన్ (హరిత ఇంధనం) అంటే ఆంధ్రప్రదేశ్‌ను గ్రీన్ ఎనర్జీ హబ్‌గా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ఈ కేంద్రం పనిచేయనుంది. రాష్ట్రం లక్ష్యంగా పెట్టుకున్న 160 గిగావాట్ల గ్రీన్ ఎనర్జీ సామర్థ్యం సాధనలో ఇది కీలక పాత్ర పోషించనుంది.

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దూరదృష్టి, ఐటీ మరియు ఎలక్ట్రానిక్స్ మంత్రి నారా లోకేష్ చొరవతో ఈ ప్రతిష్టాత్మక కేంద్రం ఏపీకి వచ్చిందని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. “ స్వర్ణాంధ్ర విజన్ 2047”లో భాగంగా అమరావతిని ప్రపంచ స్థాయి నగరంగా అభివృద్ధి చేసే దిశగా ఇది ఒక కీలక అడుగుగా భావిస్తున్నారు.

ఈ కేంద్రం ఏర్పాటుతో రాష్ట్రానికి భారీ లాభాలు చేకూరనున్నాయని అంచనా వేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న టెక్ దిగ్గజ సంస్థలు ఏపీ వైపు ఆకర్షితమయ్యే అవకాశం ఉంది. దాదాపు రూ.13 లక్షల కోట్ల పెట్టుబడుల అంచనాలకు బలమైన పునాది ఏర్పడుతుంది. సుమారు 30 లక్షల ఉద్యోగ అవకాశాలు కలుగుతాయి.

గూగుల్, మైక్రోసాఫ్ట్ వంటి అంతర్జాతీయ సంస్థలతో నేరుగా భాగస్వామ్యం చేసుకునే అవకాశాలు రాష్ట్ర యువతకు లభించనున్నాయి. అమరావతిని ప్రపంచ టెక్నాలజీ కేంద్రంగా తీర్చిదిద్దే ప్రయాణం ఇప్పుడు ప్రారంభమైందని విశ్లేషకులు చెబుతున్నారు. ఇది కేవలం ఒక ఒప్పందం మాత్రమే కాకుండా, తెలుగు యువత మేధస్సుకు గ్లోబల్ గుర్తింపు తీసుకువచ్చే అడుగుగా భావిస్తున్నారు.

Related posts

బంగ్లాదేశ్‌లో అరెస్టైన మత్స్యకారుల విడుదలకు తక్షణ చర్యలు

Satyam News

కల్తీ లడ్డులో మరో 11 మంది నిందితులు

Satyam News

పోర్టుల అభివృద్ధిలో ఏపీ ప్రభుత్వం కీలక ముందడుగు!

Satyam News

ఇరాన్ తో యుద్ధంపై ట్రంప్ కీలక ప్రకటన

Satyam News

క్వాంటం కంప్యూటింగ్ లో కీలక ఘట్టం ఆవిష్కరించిన అమరావతి

Satyam News

యాంటీ సోషల్ ఎలిమెంట్స్ బ్రాండ్ ఫ్యాక్టరీ.. తాడేపల్లి ప్యాలెస్!

Satyam News

Leave a Comment