రంగారెడ్డిహోమ్

మిడ్జిల్ లో అంబేద్కర్ విగ్రహావిష్కరణ

మహబూబ్‌నగర్ జిల్లా మిడ్జిల్ మండల కేంద్రంలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహంతో పాటు, స్థానిక సీనియర్ నాయకుడు ద్యాప గోపాల్ రెడ్డి (గుడియాన్ పల్లి) విగ్రహాన్ని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ ఆవిష్కరించారు.

ఈ కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులు, ప్రముఖ రాజకీయ నాయకులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. ముఖ్యమంత్రితో పాటు ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, రాష్ట్ర మంత్రులు జూపల్లి కృష్ణా రావు, వాకిటి శ్రీహరి, స్థానిక శాసనసభ్యుడు జనంపల్లి అనిరుధ్ రెడ్డి ఈ విగ్రహావిష్కరణ మహోత్సవంలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా నాయకులు అంబేద్కర్ దేశానికి చేసిన సేవలను, రాజ్యాంగ నిర్మాణంలో ఆయన పోషించిన పాత్రను స్మరించుకున్నారు. అలాగే స్థానిక ప్రాంత అభివృద్ధికి ద్యాప గోపాల్ రెడ్డి అందించిన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు, పెద్ద సంఖ్యలో ప్రజలు, అభిమానులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. విగ్రహాల ఆవిష్కరణ అనంతరం మండల కేంద్రంలో పండుగ వాతావరణం నెలకొంది.

Related posts

శాశ్వత రాజధానిగా అమరావతి: అసెంబ్లీ తీర్మానం

Satyam News

మోసం చేసిన వైసీపీ నేత ఇల్లు ముట్టడి

Satyam News

రికార్డు స్థాయిలో ఒకే రోజులో 9 మంది నేరస్తుల అరెస్టు

Satyam News

విశాఖ జిల్లా కలెక్టర్ వీడ్కోలు సభలో భావోద్వేగం

Satyam News

ఎగువ గొట్టివీడు యల్లమ్మ జాతరలో చాందిని బండి

Satyam News

గాజాలో ఇజ్రాయెల్ చర్యలు యుద్ధ నేరాలే

Satyam News

Leave a Comment