జాతీయంహోమ్

బెంగాల్, తమిళనాడులో పోలింగ్ ప్రారంభం

#Tamilnadu

బెంగాల్ లోని తొలి విడత స్థానాలు 152, తమిళనాడులోని మొత్తం స్థానాలకు 234 గురువారం పోలింగ్ ప్రారంభమైంది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్‌ జరగనుంది. ఈ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భారీగా బలగాలను మోహరించారు.

మే 4న ఓట్ల లెక్కింపు జరగనుంది. బెంగాల్​లో తృణమూల్, బీజేపీ మధ్య ప్రధాన పోరు జరుగుతుండగా, తమిళనాడులో ముక్కోణ పోటీ నెలకొంది. ఇక్కడ డీఎంకే, ఏఐఏడీఎంకే, టీవీకేల మధ్య పోటీ జరుగుతోంది.

తమిళనాడులో వేర్వేరు చోట్ల పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు ఓటు హక్కు వినియోగించుకున్నారు. సీఎం ఎంకే స్టాలిన్, ఆయన కుటుంబ సభ్యలు చెన్నైలోని ఓ పోలింగ్ కేంద్రంలో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. టీవీకే అధినేత విజయ్‌ చెన్నైలోని ఓ పోలింగ్ కేంద్రంలో ఓటు వేశారు. విజయ్‌ను చూసేందుకు భారీగా అభిమానులు గుమిగూడారు. ఈ క్రమంలో భారీ బందోబస్తు మధ్య విజయ్‌ను అక్కడి నుంచి తరలించారు.

సూపర్ స్టార్ రజినీకాంత్ చెన్నైలో ఓటు వేశారు. ప్రముఖ నటుడు అజిత్ కుమార్, చెన్నైలోని తిరువాన్మియూర్‌లోని ఒక పోలింగ్ కేంద్రంలో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. మైలాపూర్ అసెంబ్లీ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి, తెలంగాణ మాజీ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, చెన్నైలోని ఒక పోలింగ్ కేంద్రంలో ఓటు వేశారు.

Related posts

రెడ్ అలర్ట్:  భారీ వర్షాలతో మునిగిపోయిన ఢిల్లీ

Satyam News

11 విగ్గుల కథతో 11 సీట్ల జగన్ తాజా స్కెచ్ ఏమిటి?

Satyam News

పెళ్లైన నెలకే దంపతుల ఆత్మహత్య

Satyam News

బస్సు సేవలకు అడ్డంకులు సృష్టిస్తే కఠిన చర్యలు

Satyam News

బ్రిటన్ తో వాణిజ్య ఒప్పందం నేటి నుంచి అమలు

Satyam News

కల్తీ పాల మృతుల కుటుంబాలకు రూ.10 లక్షల పరిహారం

Satyam News

Leave a Comment