విశాఖపట్నంహోమ్

జగన్ గో బ్యాక్: దళితుల ఆందోళన తీవ్రరూపం

#Dalits

మాజీ ​ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నర్సీపట్నం పర్యటనను వ్యతిరేకిస్తూ దళిత సంఘాలు తీవ్ర నిరసన చేపట్టాయి. స్థానిక అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేసి, ‘గో బ్యాక్ జగన్’ అంటూ నినాదాలతో తమ ఆందోళనను వ్యక్తం చేశాయి.

​ఈ సందర్భంగా దళిత నాయకుడు మరిడయ్య మాట్లాడుతూ, మాకవరపాలెం మండలంలో నిర్మించతలపెట్టిన మెడికల్ కాలేజీ పనులు ముందుకు సాగడం లేదని, నిర్మాణ ప్రాంతం తుప్పలతో నిండిపోయిందని ఆరోపించారు. “ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టుగా ఉన్న కాలేజీని చూపి, అడ్మిషన్లు కూడా జరుగుతున్నాయని చెప్పి ప్రజలను మోసం చేసేందుకు జగన్మోహన్ రెడ్డి ఇక్కడికి వస్తున్నారు,” అని ఆయన విమర్శించారు.

​”దళిత డాక్టర్ సుధాకర్‌ను హింసించి చంపిన మీరు నర్సీపట్నంలో ఎలా అడుగు పెడతారు?” అని ప్రశ్నించారు. కడప జిల్లాకు సమీపంలోని చిత్తూరు జిల్లాలో అంబేద్కర్ విగ్రహాన్ని దుండగులు ధ్వంసం చేస్తే, కనీసం అక్కడి దళితులను పరామర్శించడానికి వెళ్లని ముఖ్యమంత్రి, ఇప్పుడు నర్సీపట్నంలో ఫేక్ మెడికల్ కాలేజీ, ఫేక్ జీవోలతో ప్రజలను మభ్యపెట్టడానికి వస్తున్నారని మండిపడ్డారు.

“అసలు మెడికల్ కాలేజీ కట్టడానికి మీకు అనుమతి ఉందా? దొంగ జీవోలన్నీ చూపిస్తూ ఏ మొహం పెట్టుకొని నర్సీపట్నం వస్తున్నారు?” అని వారు ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించారు. ఈ నిరసన కార్యక్రమంలో పలువురు దళిత సంఘాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Related posts

టీటీడీ ఈవోగా చార్జి తీసుకున్న ముద్దాడ రవిచంద్ర

Satyam News

సికా లో ఢిల్లీ జైళ్ల సిబ్బందికి ప్రవేశ శిక్షణ కార్యక్రమం

Satyam News

ఇమ్రాన్ ఖాన్ మృతిపై సంచలన పుకార్లు?

Satyam News

అమెరికా ఎన్నికల్లో చైనా జోక్యం నిజమేనా…?

Satyam News

ఈ ఏడాది కొత్తగా 3 పోర్టులు.. ఏపీకి బ్లూ ఎకానమీ బూస్ట్‌

Satyam News

డ్వాక్రా మహిళలకు E-నారి స్కీమ్‌

Satyam News

Leave a Comment