హైదరాబాద్హోమ్

కల్తీ టీ పౌడర్ రాకెట్ గుట్టు రట్టు

హైదరాబాద్‌లో కల్తీ టీ పౌడర్ రాకెట్‌ను పోలీసులు ఛేదించారు. టాస్క్‌ఫోర్స్, వెస్ట్ జోన్ పోలీసులు సంయుక్తంగా దాడులు చేసి నిందితుడైన ఫతేనగర్ నివాసి జగన్నాథ్ బిష్ణోయ్‌ను అరెస్ట్ చేశారు. కోకోపీట్, బెల్లం నీరు, సింథటిక్ ఫుడ్ కలర్స్‌తో కల్తీ టీ పొడిని జగన్నాథ్ తయారు చేస్తున్నాడు. ఒక కిలో టీ పౌడర్ తయారీ కోసం 50 గ్రా. కోకోపీట్ మిశ్రమం ఉపయోగిస్తున్నాడు. అలాగే సన్‌సెట్ ఎల్లో, టార్ట్రాజిన్ రంగులను వినియోగిస్తున్నాడు.

దాడులకు పాల్పడిన పోలీసులు నిందితుడి వద్ద నుంచి 120 కిలోల కలర్ మిక్స్‌డ్ టీ పౌడర్‌ను స్వాధీనం చేసుకున్నారు. అలాగే 30 కిలోల నేచురల్ టీ పౌడర్, 138 కిలోల కోకోపీట్ మిక్స్‌, 800 గ్రా. సన్‌సెట్ కలర్, 700 గ్రా. టార్ట్రాజిన్ స్వాధీనం చేసుకున్నారు. జగన్నాథ్ ఈ కల్తీ టీ పౌడర్‌ను స్థానిక టీ స్టాల్స్, డీలర్లకు అధిక ధరకు సరఫరా చేస్తున్నాడు.

Related posts

మంత్రి నారా లోకేష్ సహకారంతో రంజాన్ తోఫా

Satyam News

అల్లూరి జిల్లాలో ఎన్ కౌంటర్: 6 గురు హతం

Satyam News

మహిళల కోసం పథకాలు తెచ్చింది కాంగ్రెస్ పార్టీనే

Satyam News

2025 కేలండర్‌ లో సగం కాలం విమానంలోనే…

Satyam News

ఎసిబి వలలో వనపర్తి జిల్లా సివిల్ సప్లయి డి.ఎం

Satyam News

బకాయిల కోసం ఎదురు చూసి కన్నుమూసిన రిటైర్డ్ ఎస్సై

Satyam News

Leave a Comment