సినిమాహోమ్

జూనియర్ ఎన్టీఆర్ భుజానికి గాయం

#JrNTR

ప్రముఖ సినీ నటుడు Jr. NTR భుజానికి గాయమైనట్లు సమాచారం. వైద్య పరీక్షల అనంతరం ఆయనకు 6 నుంచి 8 వారాల పాటు పూర్తి విశ్రాంతి తీసుకోవాలని సూచించినట్లు తెలిసింది.

ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సమాచారం. వైద్యుల సలహా మేరకు కొద్ది వారాల పాటు ఆయన షూటింగ్‌లు, ఇతర కార్యక్రమాలకు దూరంగా ఉండనున్నట్లు తెలుస్తోంది.

ఈ గాయం కారణంగా ఆయన పాల్గొనాల్సిన సినిమా షూటింగ్ షెడ్యూళ్లు, ప్రచార కార్యక్రమాల్లో మార్పులు జరిగే అవకాశం ఉందని సినీ వర్గాలు భావిస్తున్నాయి. అయితే గాయం ఎలా జరిగిందనే విషయంపై అధికారిక వివరాలు ఇంకా వెల్లడికాలేదు.

జూనియర్ ఎన్టీఆర్ త్వరగా కోలుకోవాలని అభిమానులు సామాజిక మాధ్యమాల్లో ఆకాంక్షలు వ్యక్తం చేస్తున్నారు.

Related posts

గోమాంసం గోడౌన్ల వద్ద ఉద్రిక్త పరిస్థితి

Satyam News

హజ్ యాత్ర సౌకర్యాలపై సమీక్ష

Satyam News

కోటి రూపాయల లంచం తీసుకున్న అధికారి అరెస్టు

Satyam News

సైనికాధికారి భార్యపై కన్నేసిన దుర్మార్గులు

Satyam News

లైంగిక వ్యాధులతో బిల్ గేట్స్… నిజామా?

Satyam News

భారతీయులకు బ్రిటన్ కొత్త ఇమ్మిగ్రేషన్ నిబంధనలు

Satyam News

Leave a Comment