క్రీడలు హోమ్

ఉత్సాహంగా మంగళగిరి ప్రీమియర్ లీగ్-4 క్రికెట్ పోటీలు

#Mangalagiri

రాష్ట్ర ఐటీ, విద్యా శాఖల మంత్రి, మంగళగిరి శాసనసభ్యులు నారా లోకేష్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని  నారా లోకేష్ క్రీడా ప్రాంగణం(భోగి ఎస్టేట్స్)లో జరుగుతున్న ప్రీమియర్ లీగ్-4 పోటీలు రెండో రోజు ఉత్సాహంగా జరిగాయి. ఉదయం 9గంటల నుంచి సాయంత్రం వరకు ఎనిమిది జట్ల మధ్య నాలుగు మ్యాచ్‌లు జరిగాయి. అంబేద్కర్ లెవెన్స్ ఈమని వర్సెస్ పీసీ లయన్స్ కాజ మధ్య జరిగిన మ్యాచ్‌లో పీసీ లయన్స్ కాజ జట్టు గెలుపొందింది.

లెవెన్ తందర్స్ వర్సెస్ సాయి సీసీ లెవెన్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో లెవెన్ తండర్స్, కొత్తపేట సూపర్ కింగ్స్ జట్ల గల్లీ వారియర్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో కొత్తపేట సూపర్ కింగ్స్, పవన్ సీసీ వర్సెస్ హనుమాన్ యూత్ మధ్య జరిగిన మ్యాచ్‌లో పవన్ సీసీ జట్టు విజయం సాధించాయి. అన్ని మ్యాచ్‌లకు సామాజిక మాధ్యమాల ద్వారా స్కోర్ వివరాలను ఎప్పటికప్పుడు లైవ్‌లో అందిస్తున్నారు.

ప్రతీ మ్యాచ్‌లో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచిన క్రీడాకారుడికి మంగళగిరి మార్కెట్ యార్డ్ చైర్మన్ జవ్వాది కిరణ్ చంద్ సహకారంతో రూ.మూడు వేల నగదు బహుమతి, ట్రోఫీ అందజేశారు. రెండవ రోజు జరిగిన ఈ టోర్నమెంట్ లో మైనారిటీ సెల్ నాయకులు ముఖ్య అతిధులుగా హాజరయ్యారు,టీడీపీ నాయకులు,తెలుగు యువత నాయకులు క్రికెట్ పోటీలను పర్యవేక్షించారు. ఈవెంట్ స్పాన్సర్లుగా సాయి పావని కన్ స్ట్రక్షన్స్ ఇండియా ప్రైవేటు లిమిటెడ్, బిజ్ 51, సోనోవిజన్, హోటల్ డి దేవ్, తాడేపల్లి మెడ్ స్టార్ హాస్పటల్స్, సిగ్నేచర్ డైన్, హైపర్ ప్యాక్ ప్రైవేట్ లిమిటెడ్, కోకోకోలా, వీ వైబ్ ఈవెంట్స్ వ్యవహరించనున్నాయి.

ప్రతి మ్యాచ్‌ను గోపీ టీవీ యూట్యూబ్ ఛానల్, వి డిజిటల్ ద్వారా ప్రత్యక్ష ప్రసారం అందించడం జరుగుతుంది  ప్రీమియర్ లీగ్ సీజన్-4 పోటీలలో ప్రథమ బహుమతి కింద రూ.3 లక్షలు మంగళాద్రి డెవెలపర్స్, ద్వితీయ బహుమతి కింద రూ 2 లక్షలు మంచికలపూడి వైష్ణవి, తృతీయ బహుమతి కింద రూ.లక్ష నగదును వెలగపూడి కిషోర్ సహకారంతో అందించనున్నారు.

అలాగే ప్రతి మ్యాచ్‌కి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ రూ.3 వేలు జవ్వాది కిరణ్ చందు, ప్రతి మ్యాచ్‌ టాస్ విన్నర్‌కు సిల్వర్ కాయిన్, అలాగే ఫైనల్ మ్యాచ్ టాస్ విన్నర్‌కు గోల్డ్ కాయిన్ రేవతి జ్యూయలరీ,  మ్యాన్ ఆఫ్ ది సిరీస్ కింద ఎలక్ట్రానిక్ బైక్ వల్లభనేని భార్గవ్, బ్యాట్స్ మెన్ ఆఫ్ ది సిరీస్ రూ.25 వేలుతో పాటు ఎలక్ట్రికల్ బై సైకిల్ కాసరనేని జస్వంత్, బౌలర్ ఆఫ్ ది సిరీస్ రూ.25 వేలుతో పాటు బై సైకిల్ గుత్తా కిషోర్, ఫీల్డర్ ఆఫ్ ది సిరీస్ రూ.25 వేలతో పాటు బైసైకిల్ తాడిబోయిన మహేష్, వికెట్ కీఫర్ ఆఫ్ ది సిరీస్ రూ. 25 వేలుతో పాటు బై సైకిల్ షేక్ ఇంతియాజ్‌లు అందించనున్నారు. మ్యాచ్‌లో పాల్గొన్న క్రీడాకారులకు టీ షర్ట్స్, ట్రాక్స్ అందించడం జరుగుతుంది.

Related posts

శ్రీకాకుళంలో ఘనంగా క్రిస్మస్ వేడుకలు

Satyam News

రష్యా అధ్యక్షుడిని కూడా అమెరికా బంధిస్తుందా?

Satyam News

భారత జాతికి ద్రోహం చేసిన జవహర్ లాల్ నెహ్రూ

Satyam News

Leave a Comment

error: Content is protected !!