హైదరాబాద్హోమ్

మెడికో ప్రియాంక భౌతికకాయానికి మంత్రి నివాళి

#VakitiSrihari

రాజమండ్రిలో జరిగిన ఒక దారుణ సంఘటనలో గాయపడి హైదరాబాద్ కిమ్స్ లో చికిత్స పొందుతూ మరణించిన మెడికో ప్రియాంక భౌతిక కాయానికి మంత్రి వాకిటి శ్రీహరి నివాళి అర్పించారు. గాంధీ ఆస్పత్రి మార్చురీలో మెడికో విద్యార్థిని ప్రియాంక భౌతికకాయాన్ని ఆయన సందర్శించారు. ఆయనతో బాటు మాజీ ఎమ్మెల్యే, ఏఐసీసీ సెక్రటరీ సంపత్ కుమార్ కూడా నివాళులు అర్పించారు. అనంతరం ప్రియాంక తండ్రిని పరామర్శించిన మంత్రి శ్రీహరి వారి కుటుంబ సభ్యులను ఓదార్చి ధైర్యం చెప్పారు.

ఈ సందర్భంగా మంత్రి వాకిటి శ్రీహరి మాట్లాడుతూ ప్రియాంక ఘటన అత్యంత దురదృష్టకరమని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రియాంక మరణానికి కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని అన్నారు. నిందితులు చట్టాల్లోని లొసుగులను ఆసరాగా చేసుకుని తప్పించుకోకుండా కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు.

ప్రియాంక ఘటనపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెంటనే స్పందించి తమకు, అధికారులకు అవసరమైన ఆదేశాలు ఇచ్చారని మంత్రి తెలిపారు. భవిష్యత్‌లో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ప్రియాంక కుటుంబానికి ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని మంత్రి వాకిటి శ్రీహరి హామీ ఇచ్చారు.

Related posts

విజయ్ తో కలిసి జగన్ ‘మత’ ఫ్రంట్… తోడు కేటీఆర్

Satyam News

మే 1 నుంచి ప్రభుత్వ నిర్వహణలోకి హైదరాబాద్‌ మెట్రో

Satyam News

లాటరీ ద్వారా బార్ల కేటాయింపు

Satyam News

డిసెంబర్ 6న ఆశ్రా జాతీయ సదస్సు

Satyam News

ఢిల్లీలో మల్లికార్జున ఖర్గే తో వనపర్తి చిన్నారెడ్డి

Satyam News

బంగ్లాదేశ్‌లో మరో హిందువు దారుణ హత్య

Satyam News

Leave a Comment