ముఖ్యంశాలుహోమ్

కాక్రోచ్ ల నిరసనల్లో నకిలీ జర్నలిస్టుల ముఠాలు

#Press

ఇటీవల ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిర్వహించిన కాక్రోచ్ జనతా పార్టీ (CJP 2.0) నిరసన కార్యక్రమాలను కవర్ చేస్తున్న కొందరు ‘రిపోర్టర్లు’ అనుమానాస్పదంగా కనిపించారు. వారి చేతిలోని మైక్‌లపై ఇండియన్ ప్రెస్ యూనియన్ (Indian Press Union) అనే లోగో స్పష్టంగా కనిపిస్తోంది.

దీనిపై అనుమానం వచ్చిన ఓ ప్రముఖ మీడియ దిగ్గజ సంస్థకు చెందిన రీసెర్చ్ టీమ్ ఆ సంస్థ డిజిటల్ నెట్‌వర్క్‌ను నిశితంగా పరిశీలించి కీలక విషయాలను రాబట్టింది. కట్ చేస్తే.. అది ఏ రకమైన వార్తా సంస్థ కాదని, కేవలం డబ్బులు తీసుకుని విలేకరి ఐడీలు, మైక్ కిట్‌లు విక్రయించే ఓ ఆన్‌లైన్ వ్యాపార వెబ్‌సైట్ అని తేలింది.

అయితే, సదరు జాతీయ దిగ్గజ మీడియా సంస్థ సమగ్ర పరిశీలనలో కనీసం 6 వెబ్‌సైట్‌లు ఈ అక్రమ దందాను బహిరంగంగా నడుపుతున్నట్లుగా బయటపడింది. హింద్ మీడియా నెట్‌వర్క్ (Hind Media Network): వీళ్లకు రూ.599 చెల్లిస్తే చాలు ప్రెస్ ఐడీ కార్డ్, సర్టిఫికేట్, ఆన్‌లైన్ రిపోర్టర్ ప్రొఫైల్‌ను అందిస్తోంది. అంతేకాకుండా రూ. 3,500లకు ఏకంగా మైక్ కిట్‌ను కూడా విక్రయిస్తోంది.

నీడ్ 24 న్యూస్ (NEED24 News): రూ.999లకు ఐడీ కార్డ్, రిపోర్టర్ ప్రొఫైల్ ఇస్తోంది. అంతటితో ఆగకుండా, రూ.25 వేలు ఒకేసారి క్యాష్ పేమెంట్ చేస్తే.. ఏడాది పాటు చెల్లుబాటు అయ్యే ‘స్టేట్ బ్యూరో చీఫ్’ హోదాను కూడా ఇట్టే అమ్మేస్తుందని రీసెర్చ్ టీమ్ విచారణలో తేలింది.

ఏషియన్ యూనియన్ ప్రెస్ (Asian Union Press): రూ.999లకే ప్రెస్ ఐడీ, మెంబర్‌షిప్ ఇవ్వడంతో పాటు తమ సైట్‌లో ఆర్టికల్స్ పబ్లిష్ చేసుకునే సౌకర్యం కూడా కల్పిస్తోందని తేలింది.

ఇండియన్ ప్రెస్ యూనియన్ (IPU): రూ.1,799లకు ప్రింటెడ్ ప్రెస్ కార్డ్, కారు, ఇతర వాహనాలకు వేసుకునే ప్రెస్ స్టిక్కర్లను ఇన్‌స్టంట్‌గా ఇచ్చేస్తుందని స్టింగ్ ఆపరేషన్‌లో వెల్లడైంది.

ది ఫ్రంట్‌మీడియా ఫెడరేషన్ (The Frontmedia Federation): ఇంటర్నేషనల్ ప్రెస్ కార్డ్‌లతో పాటు వాహన పాస్‌లను విక్రయిస్తూ గ్లోబల్ లెవెల్‌లో ఐడీల దందా సాగిస్తోంది.

డబ్బులిచ్చి కొనుగోలు చేస్తున్న ఈ నకిలీ ప్రెస్ ఐడీలు సమాజంలో తీవ్రమైన భద్రతా ముప్పును తలపెడుతున్నాయి. ముఖ్యంగా పోలీసుల తనిఖీల నుంచి తప్పించుకోవడానికి, ఆంక్షలు ఉన్న సున్నితమైన ప్రాంతాల్లోకి అక్రమంగా ప్రవేశించడానికి కొందరు వీటిని వాడుతున్నారు.

అంతేకాకుండా, వ్యక్తిగత తగాదాల సమయంలో ఎదుటివారిని బెదిరించడానికి, మైక్ పట్టుకుని సోషల్ మీడియాలో అసత్య కథనాలు ప్రసారం చేస్తూ బ్లాక్‌మెయిలింగ్‌కు పాల్పడటానికి ఇవి ఆయుధాలుగా మారుతున్నాయి. ముఖ్యంగా సమాజం కోసం నిత్యం శ్రమించే నిజమైన జర్నలిస్టుల విశ్వసనీయత మసకబారుతోంది.

బాధ్యతాయుతమైన పాత్రికేయ రంగాన్ని ఇలా బజారుకీడ్చడం దేశ భద్రతకే ఎసరు పెడుతోందని నిపుణులు తీవ్రంగా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Related posts

విశాఖకి అమెజాన్‌..  ఐటీ ప్లస్‌ AWS డేటా సెంటర్‌..!

Satyam News

ముగ్గురు అక్కాచెల్లెళ్లు…. ఒకే మొగుడు…. వీడియో వైరల్

Satyam News

కేవ్డా మొక్క: హిమాలయాల కంటే ముందే భారత్‌లో మనుగడ

Satyam News

న్యాయ వ్యవస్థలో అవినీతి పై వ్యాసం: సుప్రీం ఆగ్రహం

Satyam News

వనపర్తి తాగునీటి సంక్షోభంపై కలెక్టర్ కు ఫిర్యాదు

Satyam News

భార్య వేధింపులు తట్టుకోలేక భర్త ఆత్మహత్య

Satyam News

Leave a Comment