రేవంత్ రెడ్డి ప్రభుత్వం రైతుల పట్ల నిర్లక్ష్యం చూపుతూ సమ్మిట్ ల పేరిట ప్రజాధనం దుర్వినియోగం చేస్తుందని ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల నిన్న కురిసిన అకాల వర్షాలకు ధాన్యం తడిసి,కొట్టుకుపోయి రైతులు హరిగోస పడుతున్న పట్టించుకునే నాథుడు కూడా లేరని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి తీవ్రంగా విమర్శించారు.
ప్రభుత్వం సాగు నీళ్లు, కరెంటు ఇవ్వక, రైతు బంధు ఏగ్గొట్టి ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యానికి కూడా భద్రత కల్పించలేని ఆసమర్ధుడు రేవంత్ రెడ్డి అని నిరంజన్ రెడ్డి మండిపడ్డారు. ప్రభుత్వం ధాన్యం కొనుగోళ్లు ప్రారంభించినా నేటికి ఒక్క బస్తా ధాన్యం కొనుగోలు చేయకపోవడం వల్ల ధాన్యం నీటి పాలైంది అని అవేదన వ్యక్తం చేశారు.
రంగారెడ్డి, కామారెడ్డి తదితర జిల్లాలలో అకాల వర్షాలతో ధాన్యం నీటి పాలు అయిందని ప్రభుత్వం అంచనా వేసి నష్ట పరిహారం చెల్లించాలని గౌరవ నిరంజన్ రెడ్డి డిమాండ్ చేశారు. ప్రభుత్వ లెక్కల ప్రకారం 24లక్షల 30వేల ఎకరాలలో పంటలు ఎండిపోయినాయని ప్రకటించారు కానీ నేటికి నష్ట పరిహారం 24పైసలు కూడా రైతులకు అందలేదని దుయ్యబట్టారు.
రాష్ట్ర వ్యాప్తంగా ఎండిన పంటలకు,అకాల వర్షాల వల్ల తడిసిన కొట్టుకుపోయిన ధాన్యానికి నష్టపరిహారం చెల్లించి రైతులలో ఆత్మస్థైర్యం నింపాలని నిరంజన్ రెడ్డి డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో వాకిటి శ్రీధర్, నందిమల్ల అశోక్, మార్క్ ఫెడ్ మాజీ డైరెక్టర్ విజయ్ కుమార్, కె.మాణిక్యం, గంధం పరంజ్యోతి, రఘువర్ధన్ రెడ్డి, వేణు గోపాల్ నాయుడు, ధర్మా నాయక్, దేవర్ల నరసింహ,సునీల్ వాల్మీకి, జోహెబ్ హుస్సేన్, చిట్యాల రాము, సయ్యద్ జమీల్, మంద రాము, బాబు నాయక్, మర్రికుంట శ్రీను, అలీం, ఖాదర్శా, వజ్రాల రమేష్ తదితరులు ఉన్నారు.
