జాతీయంహోమ్

పెళ్లైన 38 రోజులకే భర్తను చంపిన భార్య

కర్ణాటకలో వ్యాపారవేత్త సుదీప్, భార్య పోరు పడలేక , ఆమె చేసే అవమానాలు సహించలేక ఆత్మహత్య చేసుకున్నాడని నిర్ధారణ అయింది. దీంతో భార్య సౌమ్యను అరెస్ట్ చేశారు. కోర్టు ఆమెకు 14 రోజులు రిమాండ్ విధించింది. ఈ ఏడాది ఫిబ్రవరి 17 తేదీనే వాళ్ళిద్దరికీ పెళ్లైంది. పెళ్ళైన 38 రోజులకే ఆమె పెట్టే హింసలు, చేసే అవమానాలు సహించలేక సుదీప్ విషం తీసుకుని చనిపోయారు.

మార్చి 17 వ తేదీ తల్లితో కలిసి ఒక పూజకు పోతుండగా, స్కూటీ మీద వెనుకే వచ్చిన సౌమ్య, రోడ్డుకు అడ్డంగా స్కూటీ పెట్టి, తల్లితో పూజకు ఎలా పోతావంటూ తిట్టి పోసింది. అందరిలో అవమానిస్తూ మాట్లాడింది. పెళ్ళైన నెల రోజులకే ఇలా జరిగింది. దీంతో మానసికంగా కుంగి పోయి, విషం తీసుకుని చనిపోయాడు. విచారణ జరిపిన పోలీస్, సౌమ్య ఉన్మాదం, అహంకారం, వేదింపులు కారణంగానే సుదీప్ చనిపోయాడని నిర్ధారించి ఆమెపై కేసు పెట్టీ అరెస్ట్ చేసి జైలుకు పంపారు.

Related posts

నర్సంపేట వ్యవసాయ మార్కెట్ యార్డు సందర్శించిన కేటీఆర్

Satyam News

బతుకమ్మ యంగ్‌ ఫిల్మ్‌ మేకర్స్‌ ఛాలెంజ్‌ 2026 పోస్టర్ ఆవిష్కరణ

Satyam News

ఏపీలో ఎలక్ట్రిక్‌ విమానాలు…..

Satyam News

కపిల్ శర్మ కేఫ్‌పై మూడోసారి కాల్పులు

Satyam News

తెగబడి దాడులు చేస్తున్న ఇజ్రాయెల్

Satyam News

విశాఖ నగరంలో వెహికల్ రిటర్న్ మేళా

Satyam News

Leave a Comment