మహబూబ్ నగర్హోమ్

విద్య వైద్యానికే అధిక ప్రాధాన్యత

#DamodarRajanarsimha

నాగర్ కర్నూల్ నియోజకవర్గంలోని మున్సిపాలిటీలలో సోమవారం రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ, కుటుంబ సంక్షేమ, శాస్త్ర సాంకేతిక శాఖల మంత్రి దామోదర్ రాజనర్సింహ, నాగర్ కర్నూల్ పార్లమెంట్ సభ్యులు డాక్టర్ మల్లు రవి, ఎమ్మెల్సీ కూచుకుళ్ళ దామోదర్ రెడ్డి, అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ, స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ రాజేష్ రెడ్డి, జిల్లా కలెక్టర్ బాధావత్ సంతోష్ జిల్లా ఎస్పీ డాక్టర్ సంగ్రామ్ సింగ్ జీ పాటిల్, ఇతర ప్రజాప్రతినిధులు అధికారులతో కలిసి తో వివిధ అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపన పనులకు శ్రీకారం చుట్టారు.

నాగర్ కర్నూల్ పట్టణం లోని ఎండబెట్ల వద్ద హై లెవెల్ బ్రిడ్జి నిర్మాణానికి 10 కోట్లతో నిర్మించనున్న హై లెవెల్ బ్రిడ్జి నిర్మాణానికి శంకుస్థాపన, రెండు కోట్లతో సీసీ రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన, 1 కోటి ఐదు లక్షల 50 వేల రూపాయలతో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల తరగతి గదులను ప్రారంభించారు.

ప్రభుత్వ జూనియర్ కళాశాల నూతన భవనాలకు 9 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించనున్న నూతన కళాశాల భవనానికి శంకుస్థాపన, నాగర్ కర్నూల్ మున్సిపాలిటీ పరిధిలో 10, కోట్ల రూపాయలతో సి.సి రోడ్లు పనులకు శంకుస్థాపన, పట్టణంలో  డ్రైనేజ్ వ్యవస్థకు 10, కోట్ల రూపాయలతో శంకుస్థాపన, 3 కోట్ల, 14 లక్షల 60 వేల రూపాయల, వ్యయంతో పట్టణ పరిధిలోని కేసరి సముద్రం మినీ ట్యాంక్ బండ్ అధునాతన అభివృద్ధికి పనులకు శంకుస్థాపన పనులను ప్రారంభించారు.

రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ మాట్లాడుతూ 

చదువే సమాజంలో మార్పుకు నాంది పలుకుతుందని, అందుకే రాష్ట్ర ప్రభుత్వం విద్యకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తుందని, విద్య ద్వారా ప్రజల్లో అవగాహన పెరిగి, సామాజిక-ఆర్థిక అభివృద్ధి సాధ్యమవుతుందని ఆయన పేర్కొన్నారు.

రాష్ట్రంలోని ప్రతి విద్యార్థికి నాణ్యమైన విద్య అందించడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో  ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విద్య, వైద్య రంగాలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారని మంత్రి దామోదర్ రాజనర్సింహ ఈ సందర్భంగా తెలిపారు. 

పాఠశాలల మౌలిక సదుపాయాల అభివృద్ధి, ఉపాధ్యాయుల నియామకం, ఆధునిక సాంకేతికతను విద్యలో వినియోగించడం వంటి చర్యల ద్వారా విద్యా ప్రమాణాలను మెరుగుపరుస్తున్నామని మంత్రి వెల్లడించారు. విద్యా రంగం ద్వారా భవిష్యత్తు తరాలకు బలమైన పునాది వేయగలమని, అదే రాష్ట్ర సమగ్ర అభివృద్ధికి దోహదపడుతుందని ఆయన స్పష్టం చేశారు.

రాష్ట్ర ప్రభుత్వం ప్రతి విద్యార్థికి నాణ్యమైన విద్య అందించడంతో పాటు ప్రతి పేదవాడి ఆరోగ్యాన్ని కాపాడటమే ముఖ్య ఉద్దేశంగా పనిచేస్తోందని, అందుకు అనుగుణంగానే రాష్ట్రంలో విద్యా, వైద్య రంగాల అభివృద్ధికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు.

విద్యా రంగంలో మౌలిక వసతుల కల్పన, నాణ్యమైన బోధనపై దృష్టి సారించడంతో పాటు, వైద్య రంగంలో పేదలకు మెరుగైన వైద్య సేవలు అందేలా చర్యలు తీసుకుంటున్నామని మంత్రి పేర్కొన్నారు.

విద్య, వైద్య రంగాల బలోపేతమే రాష్ట్ర సమగ్ర అభివృద్ధికి పునాదిగా నిలుస్తుందనిఆయన స్పష్టం చేశారు.

విద్య ద్వారా భవిష్యత్ తరాలకు బలమైన పునాది వేయడంతో పాటు, విద్యా సంస్థల అభివృద్ధి, నాణ్యమైన బోధన, అలాగే ప్రభుత్వ ఆసుపత్రుల్లో సౌకర్యాల విస్తరణ ద్వారా ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించే దిశగా ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని, వైద్య రంగాన్ని బలోపేతం చేసి ప్రతి పేదవాడికి మెరుగైన వైద్య సేవలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. 

ప్రజల ఆరోగ్యం ప్రభుత్వానికి అత్యున్నత ప్రాధాన్యమని తెలిపారు. రాష్ట్రంలో 109ట్రామా కేంద్రాల నిర్మాణం చేశామని, వృద్ధ తల్లిదండ్రుల కోసం 37,ప్రణామ్ కేంద్రాలు స్థాపించామని, అన్నారు. రాష్ట్రంలో 200కోట్లతో 105 ఇంటిగ్రేటెడ్ స్కూళ్లు నిర్మిస్తున్నామన్నారు. న్యూట్రిషన్ ఆహారం, స్కిల్ ఎడ్యుకేషన్ విధానం కావాలన్నారు.ప్రభుత్వ ఆసుపత్రుల్లో మౌలిక వసతుల అభివృద్ధి, ఆధునిక వైద్య పరికరాల ఏర్పాటు, వైద్య సిబ్బంది నియామకం ద్వారా నాణ్యమైన వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా పని చేస్తున్నామని అన్నారు.

గ్రామీణ ప్రాంతాల ప్రజలకు సైతం మెరుగైన వైద్య సదుపాయాలు అందుబాటులోకి తీసుకువస్తామని, చేపట్టిన అభివృద్ధి పనులు నిర్ణీత గడువులో పూర్తి చేసేలా అధికారులకు ఆదేశాలు జారీ చేశామని పేర్కొన్నారు. అభివృద్ధి ఫలాలు ప్రతి కుటుంబానికి చేరాలన్నదే ప్రభుత్వ ధ్యేయమని ఆయన పేర్కొన్నారు.

Related posts

వైసీపీ మాజీ ఎంపీ గోరంట్లకు షాక్..నాన్ బెయిలబుల్ వారెంట్‌!

Satyam News

రాఖీ పౌర్ణమి స్పెషల్ బస్సుల్లో ఛార్జీలు పెంచారా?

Satyam News

జంట హత్యల కేసులో పిన్నెల్లి సోదరులకు బిగ్ షాక్

Satyam News

ఆయుర్వేదానికి ఆదరణ పెరగాలి

Satyam News

ఓపెన్‌ఏఐ భారత్‌లో తొలి కార్యాలయం ఏర్పాటు

Satyam News

శ్రీవారి పరకామణి చోరీ కేసు: పిటిషనర్ శ్రీనివాసులుకు ప్రాణహాని భయం

Satyam News

Leave a Comment