మహబూబ్ నగర్హోమ్

కోటి మంది మహిళలకు ఇందిరమ్మ చీరల పంపిణీ

#Revanthreddy

రాష్ట్రంలోని కోటి మంది మహిళలకు కోటి ఇందిరమ్మ చీరలను పంపిణీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఈ నెల 26న నాగర్‌కర్నూల్ జిల్లా అచ్చంపేటలో ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి లాంఛనంగా చీరల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు.

ఇందిరా మహిళా శక్తి కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం రెండోసారి మహిళలకు చీరలను కానుకగా అందిస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లో 65 లక్షల మంది మహిళలకు, పట్టణ ప్రాంతాల్లో 35 లక్షల మంది మహిళలకు ఈ చీరలను పంపిణీ చేయనుంది.

మహిళల అభిరుచులకు అనుగుణంగా ఆకర్షణీయమైన చిలుకపచ్చ రంగులో ఈ చీరలను ప్రత్యేకంగా రూపొందించారు. నాణ్యత, మన్నికకు ప్రాధాన్యమిచ్చారు. ఆధునిక డిజైన్లతో పాటు సంప్రదాయ పద్ధతిలో ధరించేందుకు వీలుగా రెండు రకాల చీరలను సిద్ధం చేశారు. 6.30 మీటర్ల పొడవుతో 95 లక్షల పాలిస్టర్ చీరలు, 9 మీటర్ల పొడవుతో 5 లక్షల పాలీకాటన్ చీరలను పంపిణీ చేయనున్నారు.

రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లోని నేత కార్మికులతోనే ఈ చీరలను తయారు చేయించారు. మహిళలకు చీరలను కానుకగా అందించటంతో పాటు నేత కార్మికులకు ఉపాధి కల్పించేలా ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. రేషన్​ కార్డు ఉన్న కుటుంబాల్లో 18 ఏండ్లు నిండిన మహిళలందరూ చీరలను పొందేందుకు అర్హులు. జిల్లా కలెక్టర్లు, జిల్లా ఇన్‌చార్జి మంత్రుల ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా చీరలను పంపిణీ చేస్తారు.

గ్రామాలు, పట్టణాల్లో వార్డుల వారీగా ప్రజాప్రతినిధుల సమక్షంలో సెర్ప్​ సిబ్బంది చీరలను పంపిణీ చేస్తారు. అర్హులైన మహిళలు ఆహార భద్రత కార్డు, ఆధార్ వివరాలను చూపించి చీరలను పొందవచ్చు. పారదర్శకంగా చీరల పంపిణీ కార్యక్రమం చేపట్టేందుకు ప్రత్యేక మొబైల్ యాప్‌లో లబ్ధిదారుల వివరాలను నమోదు చేస్తారు.

Related posts

రాములబండ వార్షిక బ్రహ్మోత్సవాలలో మంత్రి కోమటిరెడ్డి

Satyam News

అమరావతిలో మరో సంచలనం….

Satyam News

అస్సాం ముఖ్యమంత్రిగా హిమంత బిశ్వ శర్మ ప్రమాణం

Satyam News

కోర్టులో అంబటి వీడియో…. పొన్నవోలుకి జడ్జి షాక్‌…!!

Satyam News

ఐఆర్జీసీ పై విరుచుకుపడ్డ ఇజ్రాయెల్

Satyam News

మే 15 లోపు మెడికల్ కాలేజీ పనులు పూర్తి

Satyam News

Leave a Comment