ఆధ్యాత్మికంహోమ్

శ్రీ తిమ్మప్ప స్వామి దేవాలయంలో భక్తుల సందడి

#Maldakal

ఆదిశీల క్షేత్రమైన మల్దకల్ శ్రీ స్వయంభూ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో శనివారం భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని దాసంగాలు మ్రొక్కులు సమర్పించుకున్నారు. దేవాలయం వ్యవస్థాపక వంశీయుడు శ్రీ కృష్ణ మాన్య పట్వారి ప్రహ్లాద రావు, ఈవో సత్య చంద్రారెడ్డి ఆధ్వర్యంలో మాజీ ఎంపీపీ సత్య రెడ్డి నిర్మించిన అన్నదాన సత్రంలో గార్లదిన్నె హనుమంతు రెడ్డి ఆధ్వర్యంలో అన్నదానం ఏర్పాటు చేయగా పూజలు నిర్వహించి భక్తులకు ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా భక్తులు క్యూ పద్ధతిలో వెళ్లి అన్నదానం స్వీకరించారు.

రేపు మహాశివరాత్రి…

మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా శ్రీ స్వయంభు లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవాలయం ఆవరణలోని శ్రీ శివాలయంలో ఆదివారం మహాశివరాత్రి సందర్భంగా అభిషేకాలు, అర్చనలు నిర్వహిస్తున్నట్లు దేవాలయ చైర్మన్, ఈవో తెలిపారు. తెల్లవారుజామున 5 గంటల నుండి స్వామివారికి రుద్రాభిషేకం చేయించే భక్తులు రూ.200 చెల్లించి సాంప్రదాయ దుస్తులు ధరించి పాల్గొనవచ్చని వారు తెలిపారు. స్వయంగా రుద్రుడే తపమాచరించి శ్రీమహావిష్ణువును ఆదిశలపై వెలిసేందుకు కారణమయ్యాడు కావున ఇట్టి క్షేత్రం హరిహర క్షేత్రంగా పిలువబడుచున్నది.

Related posts

పాల‌మూరు యూనివ‌ర్సిటీలో విద్యార్థి ఆత్మ‌హ‌త్య‌..!

Satyam News

సంగారెడ్డి లో దొడ్డి కొమురయ్య జయంతి ఉత్సవాలు

Satyam News

బతుకమ్మ యంగ్‌ ఫిల్మ్‌ మేకర్స్‌ ఛాలెంజ్‌ 2026 పోస్టర్ ఆవిష్కరణ

Satyam News

కాంగ్రెస్ సర్కార్  మరో భారీ భూ కుంభకోణం

Satyam News

సెప్టెంబర్ నెలలో తిరుమలలో విశేష పర్వదినాలు

Satyam News

ఉత్తరాంధ్ర అభివృద్ధిని అడ్డుకునే ప్రయత్నాలు సహించం

Satyam News

Leave a Comment