ముఖ్యంశాలుహోమ్

మరో మారు బయటపడ్డ జగన్ క్రూరత్వం?

#JaganReddy

మాజీ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి క్రూరత్వం మరోమారు బయటపడ్డది. జగన్ సోదరి, పీసీసీ అధ్యక్షురాలు వై ఎస్ షర్మిల తన కుమార్తె వివాహం చేసుకోవడానికి యలహంక ప్యాలెస్ ఇవ్వడానికి జగన్ నిరాకరించాడు. ముహూర్తం సమయం సమీపిస్తున్న తరుణంలో వివాహానికి యలహంక ప్యాలెస్ ఇవ్వనంటూ వైఎస్ జగన్ తెగేసి చెప్పడంతో వైఎస్ షర్మిల డైలమాలో పడినట్లు తెలుస్తోంది.

కుమార్తె పెళ్లి ఎక్కడ చేయాలో తెలియక ఓ విధమైన నిర్వేదంలోకి ఏపీ పీసీసీ చీఫ్ వెళ్లినట్లు సమాచారం. వైఎస్ జగన్ తాజా చర్య రాజకీయ వర్గాల్లో ఇప్పుడు పెద్దఎత్తున చర్చ సాగుతోంది. అక్రమాస్తుల కేసులో వైఎస్ జగన్ 16 నెలలు జైలులో ఉన్నప్పుడూ జగనన్న వదిలిన బాణం అంటూ పాదయాత్ర చేసిన వైసీపీని నిలబెట్టిన చెల్లికి జగనన్న ఇప్పటికే ద్రోహం చేశారనే చర్చ నడుస్తోంది.

ఆమె పట్ల సోదరుడు జగన్ మరోసారి రాక్షసత్వం ప్రదర్శించారనే ఓ చర్చ వాడివేడిగా సాగుతోంది. జగన్ షర్మిల మధ్య గత కొద్ది రోజులుగా ఆస్తి విషయంలో ఘర్షణ చోటు చేసుకుంది. తాజాగా ఆడపడుచు ఇంట్లో శుభకార్యానికి కూడా సొంత ప్యాలెస్ ఇవ్వనన్న జగన్ నిర్ణయంతో ఆయన సొంత పార్టీలోనే గుసగుసలు మొదలయ్యాయి.

Related posts

ఇరాన్ పై యుద్ధంలో భారత్ రాయబారం?

Satyam News

ఆందోళనలతో అల్లకల్లోలంగా పాక్ ఆక్రమిత కాశ్మీర్

Satyam News

పారిశుద్ధ్య కార్మికుల సంక్షేమానికి కొత్త స్కీం

Satyam News

ఆన్ లైన్ బెట్టింగ్ ల కోసం మర్డర్… దారుణం

Satyam News

లిక్కర్ స్కాంలో ఈడీ దూకుడు: రాజ్‌ కెసిరెడ్డి, వాసుదేవరెడ్డి అరెస్టు

Satyam News

జాహ్నవి కుటుంబానికి రూ.262 కోట్ల పరిహారం

Satyam News

Leave a Comment