సంపాదకీయంహోమ్

జగన్ రాక్షసత్వం… మేనకోడలి పెళ్లిపై మెలిక…

#Jagan

మాట తప్పం, మడమ తిప్పం..మైకులు దొరికితే చాలు..వైసీపీ అధినేత జగన్‌ నోట వచ్చే మాటలు ఇవి. నా అక్కాచెల్లెమ్మలు, నా అవ్వాతాతలు అంటూ ఆయన ఒలకబోసే ఆప్యాయతలను చూసి పొంగిపోని వారు ఉండరేమో! అయితే, సభల్లో మైకుల ముందు చెప్పే ఈ  ప్రేమ ప్రవచనాలకు.. ఆయన సొంత ఇంట్లో ప్రదర్శించే  అసలు సీన్‌కు నక్కకు నాకలోకానికి ఉన్నంత తేడా ఉందనే సంగతి కొద్దిమందికి మాత్రమే తెలుసు. ఆ కొద్దిమందిలో, అన్న ప్రేమను నమ్మి మోసపోయాననే వేదనతో ఉన్న PCC చీఫ్ వైఎస్ షర్మిల మొదటి వరుసలో ఉంటారు.

షర్మిల కుమార్తె అంజలి రెడ్డికి, USలో స్థిరపడిన కర్నూలు జిల్లావాసి రఘురామిరెడ్డితో పెళ్లి నిశ్చయమైంది. మొన్నటికి మొన్న సెప్టెంబర్ 24న నిశ్చితార్థం కూడా ఘనంగా జరిగింది. నవంబర్ 25న బెంగళూరులోని యలహంక ప్యాలెస్‌లో పెళ్లి జరిపించేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. దేశంలోని బడా బడా నాయకులు, పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, వ్యాపార దిగ్గజాలకు స్వయంగా వెళ్లి పత్రికలు కూడా ఇచ్చేశారు. తీరా సీన్ కట్ చేస్తే…నా ప్యాలెస్‌లో పెళ్లికి వీల్లేదు అంటూ జగనన్న హుకుం జారీ చేశారట. అదీ సొంత తల్లి వైఎస్ విజయమ్మతోనే తెగేసి చెప్పేశారని టాక్! !

అప్పట్లో అక్రమాస్తుల కేసులో జగన్‌ 16 నెలలు జైల్లో ఊసలు లెక్కిస్తుంటే, నేను జగనన్న వదిలిన బాణాన్ని అంటూ కాలినడకన వేల కిలోమీటర్లు పాదయాత్ర చేసి వైసీపీని బతికించిన ఘనత షర్మిలది. పార్టీ అధికారంలోకి రావడానికి రక్తం చిందించిన చెల్లెలికి, అధికారంలోకి వచ్చాక జగన్ ఇచ్చిన బహుమతి ఏంటో అందరికీ తెలిసిందే. ఆస్తుల పంపిణీలో తేడాలు రాగానే సొంత చెల్లెలిని శత్రువులా చూస్తూ వచ్చారు. ఆ పగ చివరకు ఎంతవరకు వచ్చిందంటే..ఇంటి ఆడపడుచు పెళ్లికి సొంత ఇల్లు ఇవ్వడానికి కూడా మనసు ఒప్పనంతగా! బయటి అక్కాచెల్లెమ్మలకు మాటిచ్చాం.. మడమ తిప్పం అని ఉపన్యాసాలు దంచే పెద్ద మనిషి, కష్టకాలంలో ఆదుకున్న సొంత చెల్లెలి విషయంలో మాత్రం మడమే కాదు..మనసు కూడా తిప్పేసుకున్నారు అని నెటిజన్లు ఎద్దేవా చేస్తున్నారు.

జగన్‌ తీరుపై సొంత పార్టీ నేతలే ముక్కున వేలేసుకుంటున్నారు. ఏంటో.. మన నాయకుడు బయట ఏమో అక్కా చెల్లెమ్మల పక్షపాతి అని బిల్డప్ ఇస్తారు, తీరా చూస్తే సొంత మేనకోడలి పెళ్లికే ప్యాలెస్ ఇవ్వనంటున్నారేంటి..అని సొంత పార్టీ కార్యకర్తలే గుసగుసలాడుకుంటున్నారు. రాజకీయం కోసం బంధాలను, బంధుత్వాలను ఇలా బలిపీఠం ఎక్కించడం జగనన్నకే చెల్లిందని కామెంట్లు వినిపిస్తున్నాయి!

Related posts

మోక్ష ‘ద్వారం’ వైకుంఠ ఏకాదశి…..

Satyam News

ఇక మొబైల్‌లో చూపించే రైల్వే టికెట్లు చెల్లవు

Satyam News

అమిత్ షా అఖిలేష్ మధ్య మాటల యుద్ధం

Satyam News

నితిన్ నబీన్ కొత్త టీమ్: ఉపాధ్యక్షురాలిగా పురందేశ్వరి

Satyam News

ఇరాన్ అణు కేంద్రాలపై అమెరికా దాడులు?

Satyam News

శ్రీవారి ఆలయంలో శాస్త్రోక్తంగా దీపావళి ఆస్థానం

Satyam News

Leave a Comment