సిక్కు మత స్థాపకులు, ఆధ్యాత్మిక గురువు శ్రీ గురు నానక్ దేవ్ జీ జయంతి సందర్భంగా, మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ గారు మంగళవారం హైదరాబాద్ లోని అమీర్పేట్ గురుద్వారా సాహెబ్ నందు ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా బండారు దత్తాత్రేయ మాట్లాడుతూ సమానత్వం, మానవత్వం, సోదరభావం, సత్యం, నిస్వార్థ సేవ వంటి గొప్ప విలువలను ప్రపంచానికి చాటిచెప్పిన మహనీయులు గురు నానక్ గారని కొనియాడారు. వారి బోధనలు యావత్ మానవాళికి శాశ్వత మార్గదర్శకాలని పేర్కొన్నారు. ఆ మహనీయుడి జయంతిని పురస్కరించుకుని సిక్కు సోదర, సోదరీమణులందరికీ ఆయన హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో మహంకాళి సికింద్రాబాద్ జిల్లా బీజేపీ మాజీ అధ్యక్షులు శ్యామ్ సుందర్ గౌడ్, మాజీ కార్పొరేటర్ కేతినేని సరళ, అమీర్పేట గురుద్వారా సాహెబ్ అధ్యక్షులు దర్శన్ సింగ్, నాయకులు శ్రీశైలం గౌడ్, పవన్ కుమార్, చరణ్ సింగ్, భిక్షపతి గౌడ్, నక్క శ్రీనివాస్ గౌడ్, కేవల్ సింగ్, అజ్జు సింగ్ తదితరులు పాల్గొన్నారు.
