ముఖ్యంశాలుహోమ్

జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి చిత్తశుద్ధితో పని చేస్తున్నాం

#Pardhasaradhi

జర్నలిస్టులకు ఇళ్ళ స్థలాలు, పెన్షన్, హైపవవర్ కమిటీ, మీడియా అకాడమీకి గవర్నింగ్ కౌన్సిల్ ఏర్పాటుతో పాటు ఇతర జర్నలిస్టుల సమస్యల్ని వెంటనే పరిష్కరిస్తామని సమాచార పౌరసంబంధాల శాఖామంత్రి కొలుసు పార్థసారధి హామీ యిచ్చారు. జర్నలిస్టుల సమస్యల పై ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ (ఏపీడబ్ల్యుజేఎఫ్) ప్రతినిధివర్గం ఈరోజు సచివాలయంలో మంత్రిని కలిసింది.

ఈ సందర్భంగా ఫెడరేషన్ ఆధ్వర్యంలో మార్చి4న విజయవాడలో జరిగిన జర్నలిస్టుల మహాప్రదర్శనలో మంత్రి ఇచ్చిన హామీలను గుర్తు చేస్తూ పరిష్కరించిన హామీల విషయంలో కృతజ్ఞతలు తెలిపింది. మిగతా సమస్యలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టి వాటిని వెంటనే పరిష్కరించాలని కోరుతూ వినతిపత్రాన్ని అందజేసింది. దానిని శ్రద్ధగా చదివి నోట్ చేసుకున్న మంత్రి పార్థసారధి గౌరవ ముఖ్యమంత్రితో చర్చించి అతిత్వరలోనే  డిమాండ్లను అమలు చేసేలా కృషి చేస్తానని అన్నారు.

మంత్రిని కలిసిన ప్రతినిధివర్గంలో ఫెడరేషన్ రాష్ట్ర నాయకులు జి.ఆంజనేయలు, ఫెడరేషన్ ఎన్టీఆర్ జిల్లా గౌరవాధ్యక్షులు కలిమిశ్రీ, ఆంధ్రప్రదేశ్ చిన్న, మధ్యతరహా దినపత్రికలు, పీరియాడికల్స్ జర్నలిస్టుల అసోసియేషన్ అధ్యక్షులు ఖాన్, స్టేట్ ఫోటో జర్నలిస్టుల అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి వై.డి. ఆనంద్ వున్నారు.

Related posts

సోషల్ మీడియా నియంత్రణ సాధ్యమేనా?

Satyam News

విజయవాడ-తాడేపల్లి మధ్య వందల కార్లు చక్కర్లు..పవన్‌,లోకేష్‌ షాక్!

Satyam News

ఘనంగా 3వ నిరి9 అంతర్జాతీయ చలనచిత్రోత్సవం

Satyam News

హోర్మోజ్ జల సంధిలో నిరాటంకంగా సరకు రవాణా?

Satyam News

కిలాడి దంపతులపై రాయదుర్గంలో కేసు నమోదు

Satyam News

రామడుగు పోలియో చుక్కల కార్యక్రమం విజయవంతం

Satyam News

Leave a Comment