25.3 C
Hyderabad
September 29, 2026
ఆధ్యాత్మికంహోమ్

హరిత ఉద్యమం దేశమంతటా విస్తరించాలి

#Sringeri

తరువులే ఇలలో ప్రధానమని జగద్గురు శంకరాచార్య శ్రీశ్రీశ్రీ విధుశేఖర భారతి మహాస్వామి చెప్పారు. గాలిని శుద్ధి చేసి, రోగాలను నశింపజేసి, మానవులను ఎండ, చలి, తుఫానుల నుండి కాపాడుతున్న వృక్షాలను..ధర్మంగా భావించి  ప్రతి ఒక్కరూ నాటి పెంచి పోషించాల్సిన అవసరం ఉన్నదని బోధించారు.

పవిత్ర ధర్మ విజయ యాత్రలో భాగంగా శృంగేరి శారదా పీఠం ఉత్తరాధికారి జగద్గురు శంకరాచార్య శ్రీశ్రీశ్రీ విధుశేఖర భారతి మహాస్వామి ఆంధ్రప్రదేశ్, కర్నూలు జిల్లాలోని ఓర్వకల్లు గ్రామంలో వేదపాఠశాల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా గ్రీన్ ఇండియా చాలెంజ్ సృష్టికర్త, మాజీ ఎంపీ సంతోష్ కుమార్ ను శ్రీ విదుశేఖర భారతి ఆశీర్వదిస్తూ.. హరిత ధరిత్రి కోసం పాటుపడుతున్న గ్రీన్ ఇండియా చాలెంజ్ ఉద్యమం పరిఢవిల్లాలని ఆకాంక్షించారు.

నాడు లక్ష్మణుడిని కాపాడింది కూడా ఒక మొక్కే

ప్రకృతి తనను తాను ఎప్పటికప్పుడు పునరుద్ధరించుకోగలదని కానీ ప్రకృతే స్వయంగా తనను తాను నయం చేసుకోవడం ప్రారంభిస్తే.. ఆ పర్యవసానాల వల్ల వచ్చే బాధను మానవాళి తట్టుకోలేదని శ్రీ విదుశేఖర్ భారతి హెచ్చరించారు.

ఈ సందర్భంగా సనాతన ధర్మంలో.. వృక్షాలకు గల పవిత్ర స్థానాన్ని వివరిస్తూ జగద్గురువు పలు సంస్కృత శ్లోకాలను ఉటంకించారు. “వృక్షాలు గాలిని శుద్ధి చేసి, రోగాలను నశింపజేస్తాయి. కాబట్టి, మొక్కలను నాటి,  రక్షించడం సమస్త జీవులకు శ్రేయస్కరం. వృక్షాలు కేవలం ఇతరుల కోసమే జీవిస్తాయి. తుఫానులు, వర్షాలు, ఎండ, చలిని భరిస్తూ అవి మనదాకా రాకుండా మనల్ని రక్షిస్తున్నాయి.

“లక్ష్మణుడి ప్రాణాలను రక్షించడానికి హనుమంతుడు తీసుకువచ్చిన సంజీవని కూడా ఒక తరువే (మొక్క/వృక్షం) అన్న విషయం మరిచిపోకూడదు. అలాగే, సీతా మాతకు ఆశ్రయమిచ్చి, ఆమె దుఃఖాన్ని ఉపశమింపజేసినది కూడా ఆశోక వనమే. వేదాలు, ఉపనిషత్తులు, అష్టాదశ  పురాణాలు అన్నీ తరువులకే ప్రాధాన్యతనిచ్చాయి. వృక్షాలను గౌరవించడం కేవలం ఒక సంప్రదాయం మాత్రమే కాదు, ధార్మిక నాగరికతకే మూలస్తంభం” అని ఈ సందర్భంగా విదుశేఖర భారతి ధర్మశాస్త్రాలను ఉటంకించారు.

ఈ సందర్భంగా శ్రీ విదుశేఖర భారతి.. పరమ శివునికి ప్రీతిపాత్రమైన బిల్వ (మారేడు), అమ్మవారికి ఇష్టమైన కదంబం, అన్ని పురాణాల్లో ఫలాలనిచ్చే వృక్షంగా మన్ననలు అందుకునే పిప్పల (రావి) మొక్కలను నాటారు. సమస్త జీవి కోటికి ఈ వృక్షాలే ప్రాణాధారమని పేర్కొన్నారు.

Related posts

మహా జన సముద్రం గా మారిన మేడారం

Satyam News

ఇలాంటి కూతురు ఎవరికీ ఉండకూడదు….

Satyam News

తమ్ముడు అకౌంట్‌ నుండి జగన్‌కి…. పీఏ పట్టించేశాడు…!!

Satyam News

ఆసుపత్రిలో చేరిన సల్మాన్ ఖాన్ తండ్రి

Satyam News

అమెరికాలో హోరెత్తిన ట్రంప్ వ్యతిరేక నిరసనలు

Satyam News

ప్రజాపాలన -ప్రగతి ప్రణాళిక గ్రామ సభకు సీఎస్

Satyam News

Leave a Comment