పశ్చిమగోదావరిహోమ్

దళిత మహిళ పై దాడిచేసిన అగ్రకులస్తుడు

#crime

ఏలూరు జిల్లా లింగపాలెం మండలం ముడిచెర్ల గ్రామం లో దళిత మహిళపై అగ్రవర్ణానికి చెందిన వ్యక్తి దాడికి పాల్పడిన సంగతి శుక్రవారం చోటు చేసుకుంది.

ఎర్ర వీర రాఘవమ్మ వాళ్ల బావగారైన ఎర్ర సత్యనారాయణ, పొలంలో మేకలు మేపుతుండగా, అదే గ్రామానికి చెందిన కలవల శ్రీధర్ రెడ్డి మేకలు తన పొలం లో పంటను తిన్నాయనే అనుమానం తో ఆమెపై దాడికి పాల్పడ్డాడు. కులాన్ని కించపరిచే విధంగా దూషించి మహిళ అనే కనికరం కూడా లేకుండా గొంతు నులిమి, పారతో దాడి చేసి రక్త గాయ మయ్యేలా చేశాడు.

తనను తీవ్రంగా గాయపర్చాడని వీర రాఘవమ్మ కన్నీటి పర్యంతమై తన బంధువులకు గ్రామస్తులకు వివరించింది. గ్రామస్తుల సలహా మేరకు ఆమె బంధువులు వీర రాఘవమ్మను అదే రోజు చింతలపూడి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, ప్రస్తుతం అక్కడ చికిత్సపొందుతుంది. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Related posts

4 ఇండస్ట్రియల్ పార్కుల ఏర్పాటుకు  ప్రతిపాదనలు

Satyam News

భార్యతో విడాకులు త్రిష తో చెట్టపట్టాలు

Satyam News

డిఎస్సీ 2025 పై సృతి మించిన వైసీపీ ఫేక్ ప్రచారం

Satyam News

ఒమాన్ తీరంలో మళ్లీ భారతీయ నౌకపై దాడి

Satyam News

‘గ్లోబల్ హెల్త్ కేర్ హబ్’గా హైదరాబాద్

Satyam News

అమరావతిలో చారిత్రక ఘట్టం..ఫైనాన్సియల్ డిస్ట్రిక్ట్ ఏర్పాటుకు అడుగు.!

Satyam News

Leave a Comment