హైదరాబాద్హోమ్

విజయ్ తో కలిసి జగన్ ‘మత’ ఫ్రంట్… తోడు కేటీఆర్

#JaganFront

పాన్‌ ఇండియా పాలిటిక్స్ చేయలేని ప్రాంతీయ పార్టీలు.. రీజనల్, రెలీజియన్ సెంటిమెంట్‌ రాజకీయాలనే నమ్ముకొంటున్నాయి. గత కొంతకాలంగా జరుగుతున్న పరిణామాలను నిశితంగా గమనిస్తే.. జాతీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్‌.. అధిపత్యాన్ని సవాల్‌ చేయడానికి ఒక ప్రాంతీయ కూటమి ఊపరి పోసుకొంటోందని ప్రచారం జరుగుతోంది.

తమిళనాడులో విజయ్‌ విజయం తర్వాత ఈ సౌత్‌ ఫ్రంట్‌ ప్రయత్నాలు ఊపందుకొన్నాయి. దక్షిణాదిలో బీజేపీ కూటమికి ముఖ్యంగా టీడీపీ – బీజేపీ – జనసేన కూటమికి చెక్‌ పెట్టాలంటే…ఆ మూడు పార్టీల మధ్య మరో చాయిస్‌ లేదని భావిస్తున్నారట.. అందుకే, ప్రాంతీయ, మత రాజకీయాలకు బీజం పోస్తున్నారని తెలుస్తోంది..   ఆ ముగ్గురు నేతలు ఎవరో కాదు, వైసీపీ అధినేత జగన్‌, టీవీకే చీఫ్‌ విజయ్‌, బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌..

క్రిస్టియన్‌ ఓటర్లలో ఫాలోయింగ్‌ అనేది.. జగన్‌కి, విజయ్‌కి మధ్య ఉన్న కామన్‌ పాయింట్‌. సంక్షేమ అజెండా, ఉచిత పథకాలు, డౌన్‌ టు ఎర్త్‌ లుక్స్ వంటి విషయాల్లోనూ విజయ్‌.. జగన్‌ని ఫాలో అవుతున్నారని అంటారు. తమిళనాడు ఎన్నికల ప్రచారంలో జగన్‌ ఫోటో పట్టుకొన్నారని చెబుతున్నా….. మతం కోణంలోనే  వైసీపీ శ్రేణులు విజయ్‌ని ఓన్‌ చేసుకొంటున్నాయనే వాదన ఉంది.

మరోవైపు కేటీఆర్‌, జగన్‌ మధ్య స్నేహం అందరికీ తెలిసిన ఓపెన్‌ సీక్రెట్‌. అధికారం పోయిన తర్వాత కేటీఆర్‌తో జగన్‌ సమాలోచనలు.. బెంగళూరులో కేటీఆర్, జగన్‌ అధికారిక, అనధికార సమావేశాలు.. ఈ రెండు పార్టీల మధ్య వ్యూహాత్మక బంధాన్ని తెలియజేస్తోంది. తాజాగా ఎలహంక ప్యాలెస్‌ నుండి జగన్‌ని హైదరాబాద్‌లోని లోటస్‌ పాండ్‌కి మకాం మార్చాలని గులాబీ నేతలు ఒత్తిడి చేయడం వెనక కారణం ఈ కూటమి కోసమే అని సమాచారం..

తమిళనాడులో బీజేపీ కూటమిని దెబ్బకొట్టి.. విజయం సాధించిన విజయ్ మోడల్‌.. కొత్త కూటమికి ప్రేరణగా మారింది. మూడు రాష్ట్రాల్లో బలంగా ఉన్న బీఆరెస్, వైసీపీ టీవీకేలాంటి మూడు బలమైన పార్టీలు చేతులు కలిపితే.. సంకీర్ణ రాజకీయాల్లో బార్గెయినింగ్‌ కేపాసిటీ పెరుగుతుంది. కానీ ఇక్కడ అతి పెద్ద సమస్య ఏంటంటే.. విజయ్‌ ఇప్పటికే కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకున్నారు.

తెలంగాణలో కేసీఆర్‌కి, ఏపీలో జగన్‌కి కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన ప్రత్యర్ధిగా ఉంది. విజయ్‌ కాంగ్రెస్‌తో అలైన్‌ అవడం.. జగన్‌-కేసీఆర్‌ ప్లాన్‌కి పెద్ద మైనస్. అదీగాక భావ సారూపత్యలు ఉన్నా.. ఒకరి ఓటర్లను మరొకరు పెద్దగా ప్రభావితం చేయలేని పరిమితులు.. ఈ రీజనల్‌ రిలీజియన్‌ ఫ్రంట్‌కి ఆదిలోనే అడ్డంకిగా మారుతున్నాయి.

ఇంట గెలిచి రచ్చ గెలవాలంటారు. కానీ జగన్‌ అండ్‌ కేటీఆర్ మాత్రం బయటి శక్తుల సాయంతో సొంత రాష్ట్రంలో గెలిచే ఆలోచనలు చేస్తున్నారు. ఇక్కడ రీజనల్‌‌ సెంటిమెంట్‌ రివర్స్‌ అయినా.. రెలీజియన్ పాలిటిక్స్‌ బెడిసికొట్టినా మొదటికే మోసం వస్తుంది.

వీరంతా అవినీతి కింగ్ లే….

ఈ పార్టీలకి మరో సవాల్‌.. అవినీతి ముద్ర.. వైసీపీ పురుడుపోసుకోకముందే ఆ పార్టీ అధినేత జగన్‌పై బోలెడు కరప్షన్‌ అలిగేషన్స్‌ ఉన్నాయి.. 2019 – 24లో పవర్‌లోకి వచ్చిన తర్వాత ఫ్యాన్‌ పార్టీ అవినీతి ఏ స్థాయికి చేరిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. ఒక్క చాన్స్‌తో గెలిచిన  జగన్‌ ఓటమికి ఇదే ప్రధాన కారణం.. తెలంగాణలో పదేళ్లు అధికారంలో ఉన్న కేటీఆర్‌పై ఇప్పటికే బొచ్చెడు కేసులు మెడపై వేలాడుతున్నాయి.

కాళేశ్వరం నుండి ఫార్ములా వన్‌ కార్‌ రేసింగ్‌ వరకు కేటీఆర్‌ పార్టీపై వేల కోట్ల ఆరోపణలు నేటికీ హెడ్‌ లైన్స్‌గా మారుతున్నాయి.. తమిళనాడులో అనూహ్యంగా అధికారంలోకి వచ్చిన టీవీకేలో ఆ పార్టీ కీలక నేత, మంత్రి అధర్వ అర్జున్‌ తండ్రి లాటరీ కింగ్‌..

ఈ ముగ్గురు నేతలు, ఈ మూడు పార్టీలు దక్షిణాది రాజకీయాలలో ప్రభావం చూపాలని భావిస్తున్నారు. ముఖ్యంగా చంద్రబాబు దూకుడుకి ముకుతాడు వేయాలనేది వీరి ప్రధాన లక్ష్యం..  వీటి ప్రాంతీయ, మత రాజకీయాలు ఎన్‌డీఏ అలయెన్స్‌కి చెక్‌ పెట్టగలవా..?? ఈ ప్రశ్నలకు సమాధానం దొరకాలంటే, మరికొన్ని రోజులు వెయిట్‌ చేయకతప్పదు..

Related posts

నటి సంచితా ఉగాలే ఆత్మహత్య

Satyam News

ఓక్రిడ్జ్‌ ఇంటర్నేషనల్ స్కూల్‌కు జీహెచ్‌ఎంసీ నోటీసు

Satyam News

కామెడీ పేరుతో వికలాంగుల్ని అవమానపరిచిన యూట్యూబర్లు

Satyam News

జాత్యహంకారంతో సిక్కు యువతిపై అత్యాచారం

Satyam News

ఆ న్యాయమూర్తి ఎదుటకు నేను కూడా వెళ్లను

Satyam News

దుబాయ్ ఎయిర్ షో లో ప్రమాదం

Satyam News

Leave a Comment