26.7 C
Hyderabad
September 20, 2026
సంపాదకీయంహోమ్

31 దేశాల కంపెనీలు.. లక్షన్నర ఉద్యోగాలు… ఏపీలో మెగా జాబ్‌ సెంటర్‌!

#CBNDubai

మన దేశంలో సిటీల్లో ఇండస్ట్రీలు పెడతారు. అవే ఇండస్ట్రియల్ సిటీలు అవుతాయి. కానీ పరిశ్రమల కోసమే ప్రత్యేకంగా ఒక నగరాన్ని నిర్మిస్తే.. ఫ్యాక్టరీల కోసమే ఒక సిటీని డెవలప్ చేస్తే.. అదే శ్రీసిటీ. తిరుపతి జిల్లాలోని శ్రీసిటీని 2028 నాటికి దేశంలోనే టాప్‌ ఇండస్ట్రియల్‌ హబ్‌గా అభివృద్ధి చేయాలని సీఎం చంద్రబాబు కృషి చేస్తున్నారు. విశాఖలో జరిగిన సీఐఐ పార్ట్‌నర్‌షిప్‌ సమ్మిట్లో 50కి పైగా ఇంటర్నేషనల్‌ కంపెనీలు శ్రీసిటీలో ప్లాంట్లు నెలకొల్పడానికి ఎంఓయూలు కుదుర్చుకున్నాయి.

ప్రస్తుతం శ్రీసిటీలో 70 మంది ఉపాధి పొందుతున్నారు. జపాన్‌, సౌత్‌ కొరియా, చైనా వంటి తూర్పు ఆసియా దేశాలతో పాటు ఐరోపా, అమెరికాలకు చెందిన వందలాది కంపెనీలు శ్రీసిటీ నుంచి పని చేస్తున్నాయి. దేశీయ తయారీ రంగ సంస్థలు ఇక్కడ యూనిట్లు నెలకొల్పడానికి ఆసక్తి చూపిస్తున్నాయి. ఎలక్ట్రానిక్స్, ఆటోమొబైల్స్‌, ఫుడ్‌ ప్రాసెసింగ్ రంగాలకు చెందిన సంస్థలు ఇక్కడి నుంచి వేల కోట్ల విలువైన ఉత్పత్తలును తయారు చేస్తున్నాయి.

రేమాండ్, ఎల్‌జీ వంటి జాతీయ, అంతర్జాతీయ సంస్థలకు చెందిన కొత్త యూనిట్ల నిర్మాణం ప్రారంభమైంది. ఇప్పటికే ఎంవోలు చేసుకున్న కంపెనీల ద్వారా మరో లక్షన్నర మందికి ఇక్కడ ఉద్యోగాలు వస్తాయి. శ్రీసిటీ విస్తరణ కోసం రాష్ట్ర ప్రభుత్వం అదనంగా 6 వేల ఎకరాలను కేటాయించింది. ఎయిర్ కనెక్టివిటీ కోసం ఇక్కడి సమీపంలో ఎయిర్‌ స్ట్రిప్‌ నిర్మిస్తున్నారు.

దగ్గరలో చెన్నై మహానగరం ఉండటం శ్రీ సిటీకి కలిసొస్తుంది. చెన్నై మాన్యుఫ్యాక్చరింగ్‌ నెట్‌వర్క్‌తో అనుసంధానం చేసుకొని.. ఇక్కడ యూనిట్లను నిర్వహిస్తున్నారు. జపాన్‌ ఇండియా ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ మ్యాన్యుఫ్యాక్చరింగ్‌ సంస్థ ద్వారా స్థానిక యువతకు జపనీస్‌ స్టైల్‌ స్కిల్స్‌ నేర్పిస్తున్నారు. రాష్ట్రాన్ని మూడు ఆర్ధిక జోన్లుగా విభజించి విశాఖపట్నం, అమరావతి, తిరుపతి కేంద్రంగా ఎకనామిక్‌ కారిడార్లను అభివృద్ధి చేస్తున్నారు.

తిరుపతి జోన్‌లో శ్రీసిటీ కీలకమైన ఇండస్ట్రియల్‌ హబ్‌గా.. మెగా జాబ్‌ సెంటర్‌గా రూపుదిద్దుకొంటోంది. తెలంగాణలో ఒక హైదరాబాద్‌, కర్నాటకలో ఒక బెంగళూరు ఉంటే.. ఏపీలో ప్రతి జిల్లాలో శ్రీసిటీ లాంటి పారిశ్రామిక నగరాలను డెవలప్‌ చేయడానికి సీఎం చంద్రబాబు ప్రణాళికలు సిద్ధం చేశారు. ఇప్పుడు ఆ ప్లాన్‌లు ఆచరణలోకి వస్తున్నాయి. త్వరలో ఫలితాలు ప్రజల కళ్ల ముందు కనిపిస్తాయి.. ప్రత్యక్షంగా అందుతాయి.

Related posts

గణతంత్ర దినోత్సవం సందర్భంగా లోక్ భవన్‌లో తేనీటి విందు

Satyam News

శ్రీరామనవమి బ్రహ్మోత్సవాల్లో పాల్గొనండి

Satyam News

అమెరికా బెదిరింపులకు ఎదురొడ్డి నిలబడాలి

Satyam News

ఉత్తరాంధ్ర జిల్లాలకు భారీ వర్షాల హెచ్చరిక

Satyam News

నీట్ గా లీక్ చేసిన లెక్చరర్లు: మరొకరు అరెస్టు

Satyam News

మెరుస్తున్న కలలకు వాస్తవ రూపం

Satyam News

Leave a Comment