కరీంనగర్హోమ్

తెలంగాణ అమరుల త్యాగం మరువలేనిది

#RamaduguMandal

తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని రామడుగు మండల గోపాలరావు పేట వ్యవసాయ మార్కెట్ యార్డులో వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బొమ్మర వేణి తిరుమల తిరుపతి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం తెలంగాణ ఉద్యమ అమరుల త్యాగాలను స్మరించుకుంటూ వారికి ఘన నివాళులర్పించారు.

ఈ సందర్భంగా బొమ్మర వేణి తిరుమల మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం కోసం ఎన్నో సంవత్సరాలు ప్రజలు చేసిన పోరాటాలు, ఉద్యమకారుల త్యాగాల ఫలితంగానే ప్రత్యేక రాష్ట్రం సాధ్యమైందన్నారు. తెలంగాణ ఆవిర్భావం ప్రతి తెలంగాణ వాసికి గర్వకారణమని పేర్కొన్నారు. రాష్ట్ర అభివృద్ధి, ప్రజా సంక్షేమం, యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడం, రైతుల సంక్షేమం కోసం ప్రతి ఒక్కరూ కలిసి పనిచేయాలని ఆమె పిలుపునిచ్చారు.

అలాగే తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుతూ భావితరాలకు రాష్ట్ర ఉద్యమ చరిత్రను తెలియజేయాల్సిన బాధ్యత అందరిపైనా ఉందన్నారు. ప్రజల ఆశయాలకు అనుగుణంగా అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగించాలని ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ పిండి సత్యం, బాలగౌడ్, మల్లేశం, బాపు రాజు, డైరెక్టర్లు వేణుగోపాల్ రెడ్డి, ఎల్లయ్య, శంకరయ్య, నారాయణ ,మల్లేశం, శ్రావణ్ కుమార్ కార్మికులుస్థానిక ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, మహిళా నాయకులు, యువజన నాయకులు, కార్యకర్తలు మరియు ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కార్యక్రమం అనంతరం పరస్పరం తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుకున్నారు.

Related posts

శాంతి నగర్ లో ఘనంగా గో పూజ

Satyam News

సంగారెడ్డి లో దొడ్డి కొమురయ్య జయంతి ఉత్సవాలు

Satyam News

Exposed: యుద్ధ సమయంలో పాకిస్తాన్ డబల్ గేమ్

Satyam News

వైసీపీ  పెయిడ్ ఆర్టికల్స్‌…. వణుకుతున్న వల్లభనేని వంశీ

Satyam News

ప్రాణరక్షణలో ట్రామా మెడిసిన్ పాత్ర కీలకం

Satyam News

బైక్ పై ముందు ఎస్పి… వెనుక మంత్రి

Satyam News

Leave a Comment