25.3 C
Hyderabad
September 29, 2026
మహబూబ్ నగర్హోమ్

హత్య కేసులో నిందితులు అరెస్టు

#WanaparthyPolice

వనపర్తి జిల్లా గోపాలపేట మండలం లక్ష్మి తాండాలో మూడవత్ మేగ్యానాయక్ హత్య కేసులో కుర్వ శ్రీశైలం(25),మూడవత్ మమత(24) ను అరెస్టు చేశామని వనపర్తి డిఎస్పీ గిరిబాబు చెప్పారు. ఈ నెల 25న రాత్రి మేగ్యనాయక్ హత్యకు గురైనట్లు అయన విలేకరులకు తెలిపారు.

నిందితులు కుర్వ శ్రీశైలం వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలం బుజుర్గ్ కొతలాపూర్  గ్రామం, మూడవత్ మమత లక్ష్మి తండా(మృతుని కోడలు)గోపాలపేట మండలం అని డిఎస్పీ చెప్పారు. మృతుడు మేగ్యనాయక్ కుటుంబంలో వివాదాలు జరుగుతున్నాయని, మమత ప్రేరేపణతో కుర్వ శ్రీశైలం హైదరాబాద్ నుండి వచ్చి హత్య చేసినట్లు తేలిందని చెప్పారు.

జిల్లా ఎస్పీ సునీత రెడ్డి పర్యవేక్షణలో డిఎస్పీ గిరిబాబు, సి.ఐ సుగంధ రత్నం ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి నిందితులను గుర్తించి అరెస్టు చేశారు. హైదరాబాద్ బాలానగర్ లో శ్రీశైలం, మమతను అదుపులోకి తీసుకున్నామని డిఎస్పీ తెలిపారు. సిఐ సుగంధ రత్నం, గోపాలపేట ఎస్ఐ శశిధర్ విలేకరుల సమావేశంలో పాల్గొన్నారు.

పోలిశెట్టి బాలకృష్ణ, సీనియర్ విలేకరి, సత్యం న్యూస్ నెట్

Related posts

రైస్ పుల్లింగ్ పేరుతో చీటింగ్ చేసిన వైసీపీ నేత

Satyam News

శ్రీవారి భక్తులను మోసం చేస్తున్న నకిలీ వెబ్సైట్లు

Satyam News

ఇలాంటి కూతురు ఎవరికీ ఉండకూడదు….

Satyam News

భీమిలిలో న్యాయవాదిపై కత్తితో దాడికి యత్నం

Satyam News

మరణానంతరం పార్థివ దేహం స్విమ్స్ కు డొనేషన్

Satyam News

రమ్య టైపు ఇన్స్టిట్యూట్ విద్యార్థినికి రాష్ట్ర స్థాయి ర్యాంక్

Satyam News

Leave a Comment