ముఖ్యంశాలుహోమ్

రమ్య టైపు ఇన్స్టిట్యూట్ విద్యార్థినికి రాష్ట్ర స్థాయి ర్యాంక్

ఎస్.బి.టెట్ ఫిబ్రవరి 2026లో నిర్వహించిన టైప్ రైటింగ్ పరీక్షలలో తెలుగు హయ్యర్ గ్రేడ్ లో రాష్ట్ర స్థాయి ర్యాంకులు సాధించిన విద్యార్థులకు ఏపీ టైప్ రైటింగ్ & షార్ట్ హ్యాండ్ ఇన్స్టిట్యూట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మెడల్స్, ప్రశంసా పత్రాలను ప్రదానోత్సవ కార్యకమం జరిగింది.

ఆదివారం గుంటూరులో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా గుంటూరు ప్రభుత్వ మహిళా పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్ ఉషారాణి, హెచ్ఓడి శంకరరావు హాజరయ్యారు. ఈ సందర్బంగా తెలుగు హయ్యర్ 3వ ర్యాంక్ సాధించిన నరసరావుపేటలోని రమ్య టైపు ఇన్స్టిట్యూట్ విద్యార్థిని కుమారి షేక్. ఫాతిమాకు మెడల్, ప్రశంసాపత్రం అందచేశారు.

ఈ కార్యక్రమంలో అసోసియేషన్ అధ్యక్షులు శ్రీరాములు, గౌరవ అధ్యక్షులు సీవీ. మోహనరావు, ప్రధాన కార్యదర్శి ఏజికే. మూర్తి, ఆర్గనైజింగ్ సెక్రటరీ షేక్. మహబూబ్ సుభాని, కోశాధికారి నరసింహులు, రాష్ట్రంలోని టైప్ ఇన్స్టిట్యూట్స్ ప్రిన్సిపాల్స్, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.

Related posts

భోగాపురం ఎయిర్‌పోర్టు..ఉత్తరాంధ్ర గ్రోత్ ఇంజిన్.!

Satyam News

నందికొట్కూరు లో డ్రగ్ చాక్లెట్లు?

Satyam News

దసరా శరన్నవరాత్రుల ఉత్సవాలకు భారీ ఏర్పాట్లు

Satyam News

విశాఖకు మరో ఘనత..మహిళలకు అత్యంత సురక్షిత నగరం

Satyam News

ఎట్టకేలకు ఇల్లు చేరిన పెద్దారెడ్డి !

Satyam News

హనుమంత వాహనంపై శ్రీరామచంద్ర స్వరూపంలో గోకులానందుడు

Satyam News

Leave a Comment