వైసీపీ టైమ్‌లో జరిగిన APPSC స్కామ్‌లో రోజుకో కొత్త విషయం బయటపడుతోంది. కేవలం మార్కులు మార్చడం, ఇంటర్వ్యూల్లో తమ వాళ్లకు ఎక్కువ మార్కులు వేయడమే కాదు..టెక్నాలజీని వాడి ఎలా మోసం చేశారనేది ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. కష్టపడి చదివిన నిరుద్యోగులను నిలువునా ముంచిన ఈ స్కామ్‌లో షాకింగ్ విషయాలు బయటకు వస్తున్నాయి.
పేపర్లు దిద్దడంలో డిజిటల్ మాయాజాలం నడిచింది. ఆన్సర్ షీట్లను స్కాన్ చేసి ఆన్‌లైన్‌లో దిద్దే సిస్టమ్‌ను అనుకూలంగా మార్చుకున్నట్లు తెలుస్తోంది. అధికారికంగా సెట్ చేసిన కంప్యూటర్ల నుంచి కాకుండా, IP అడ్రస్‌లు మార్చేసి బయట వ్యక్తులతో పేపర్లు దిద్దించారు. తమకు కావాల్సిన అభ్యర్థుల లాగిన్ ఐడీలు, పాస్‌వర్డ్‌లను డైరెక్ట్‌గా బ్రోకర్లకు ఇచ్చేసి, సాఫ్ట్‌వేర్‌లో మ్యాన్యువల్‌గా మార్కులు పెంచేలా సెట్టింగ్ చేశారని తెలుస్తోంది.
ఖాళీ పేజీలతో సరికొత్త ప్లాన్ అమలు చేశారు. ఎగ్జామ్ సెంటర్ల నుంచి స్ట్రాంగ్ రూమ్‌లకు పేపర్లు వెళ్లే దారిలోనే పెద్ద స్కెచ్ వేశారు. ముందుగా మాట్లాడుకున్న అభ్యర్థులు తమ ఆన్సర్ షీట్లలో కావాలనే కొన్ని పేజీలు ఖాళీగా వదిలేశారు. ఆ పేపర్లు స్ట్రాంగ్ రూమ్‌కు వెళ్లేలోపే, మధ్యలో ఆ ఖాళీ పేజీల్లో సబ్జెక్ట్ ఎక్స్‌పర్ట్స్‌తో సరైన జవాబులు రాయించారు. ఆ తర్వాతే వాటిని స్కాన్ చేశారని ఆరోపణలు వస్తున్నాయి. బోర్డులోని కొందరు అధికారులకు డబ్బులు ఎరవేసి ఈ పని చేయించినట్లు తెలుస్తోంది.
ఈ స్కామ్‌లో కేవలం రాజకీయాలు మాత్రమే కాదు, భారీగా డబ్బు చేతులు మారింది. ఒక్కో ఆర్డీఓ, డీఎస్పీ పోస్టుకు రూ.2 కోట్ల నుంచి రూ.3 కోట్ల దాకా రేటు కట్టినట్లు సమాచారం. ఈ డబ్బును డైరెక్ట్‌గా క్యాష్ రూపంలో తీసుకోకుండా, బినామీ పేర్లతో రియల్ ఎస్టేట్ వెంచర్లలో పెట్టారు. బ్రోకర్ల ద్వారా వచ్చిన ఈ కోట్లు హవాలా రూపంలో అప్పటి పెద్దల చేతుల్లోకి వెళ్లాయని దర్యాప్తు సంస్థలు గుర్తించాయి.
ఇప్పటిదాకా కిందిస్థాయి అధికారులు, బోర్డు మెంబర్ల పేర్లే వినిపించాయి. కానీ ఇప్పుడు దొరికిన ఈ టెక్నికల్ ప్రూఫ్స్, హవాలా లింక్స్‌తో గత ప్రభుత్వంలోని పెద్ద లీడర్ల మీద దర్యాప్తు సంస్థలు ఫోకస్ పెట్టాయి. ఈ సాఫ్ట్‌వేర్ మోసం వెనుక ఉన్న టెక్నికల్ టీమ్‌ను గట్టిగా విచారిస్తే.. అసలు ఈ స్కామ్ ఎవరి కనుసన్నల్లో జరిగిందో మొత్తం బండారం బయటపడటం ఖాయంగా కనిపిస్తోంది.
