26.3 C
Hyderabad
September 19, 2026
మహబూబ్ నగర్హోమ్

మున్సిపల్ ఎన్నికలకు సర్వం సిద్ధం

ఈనెల 11వ తేదిన జోగుళాంబ గద్వాల్ జిల్లాలో గద్వాల్ పట్టణం, అయిజ, శాంతినగర్, అలంపూర్, మున్సిపాలిటీలకు జరగనున్న రెండవ సాధారణ మున్సిపాలిటీ ఎన్నికల సందర్భంగా జిల్లా పోలీస్ శాఖ ఎన్నికల నిర్వహణకు పటిష్ట చర్యలు తీసుకుందని ఎన్నికలను ఇతర శాఖల సమన్వయంతో ప్రశాంత వాతావరణంలో నిర్వహిస్తాం అని జిల్లా ఎస్పీ టి. శ్రీనివాసరావు తెలిపారు.

జిల్లా వ్యాప్తంగా పటిష్టమైన పోలీసు నిఘా ఉన్నది అన్నారు, ప్రలోభాల ను నిర్మూలించి ఓటర్లు స్వేచ్ఛగా ఓటు హక్కును సద్వినియోగం చేసుకునేలా కృషి చేస్తున్నాము అన్నారు. దీనికోసం ప్రత్యేక నిఘా బృందాలు పని చేస్తున్నాయని తెలిపినారు.

అదనపు ఎస్పీ, డిస్పీల ఆధ్వర్యంలో ప్రత్యేక స్ట్రైకింగ్ ఫోర్స్ సిబ్బంది మరియు ఇతర అధికారులతో స్ట్రైకింగ్ ఫోర్స్, రూట్ మొబైల్స్ ను అప్రమత్తంగా పని పాటు చేసినట్టు తెలిపారు. ప్రతి ఒక్కరూ ఎన్నికల నియమావళికి లోబడి నడుచుకోవాలని కోరారు.

నాలుగు మున్సిపాలిటీ కేంద్రాలలో 375 మంది పోలీస్ సిబ్బందితో రక్షణ బందోబస్తు నిర్వహణకు ప్రణాళిక చేయడం జరిగింది అన్నారు. ఐదు మున్సిపాలిటీ కేంద్రాలలో 77 వార్డులకు గానూ 189 పోలింగ్ కేంద్రాల్లో ఎన్నికలు జరుగుతుండగా 105 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను గుర్తించినట్లు తెలిపారు.

నాలుగు మున్సిపాలిటీ కేంద్రాలలో జరగనున్న ఎన్నికలను జిల్లా ఎలక్షన్ సెల్ ద్వారా క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ చేయడం జరుగుతుంది. బందోబస్తు నిర్వహణ మొదలుకుని ఎన్నికల సామాగ్రికి భద్రత కల్పించే వరకు ప్రతి అంశాన్ని ప్రణాళికబద్ధంగా పర్యవేక్షణ చేస్తున్నామని అన్నారు.

ఎన్నికల సంఘం సూచించిన నియమ నిబంధన ప్రకారం ఐదు మున్సిపాలిటీ పరిధిలోని ఎన్నికల సామాగ్రికి పటిష్ట భద్రత ఏర్పాటు చేయడం జరిగిందని ఆయుధ పోలీసుల పహారాలో స్ట్రాంగ్ రూములు ఏర్పాటు చేసి రక్షణ కల్పిస్తున్నామని తెలిపారు.

అలాగే ఎన్నికల సామాగ్రి తరలింపులో ఎన్నికల నిర్వహణ అధికారులతో పాటు రూట్ మొబైల్ సిబ్బంది భద్రతగా ఉంటారని తెలిపారు. ప్రచార సమయం ముగిశాక ప్రచారం చేయొద్దు. 9వ తేది సోమవారం సా.5 గంటలకు ఎన్నికల ప్రచార సమయం ముగిస్తుంది ఎన్నికల ప్రచార సమయం ముగిశాక అభ్యర్థులు ఎవరు కూడా ప్రచారం నిర్వహించకూడదని కోరారు.

నిబంధనలు ఉల్లంఘించి ప్రచారం నిర్వహిస్తే అలాంటి వారిపై చర్యలు తీసుకోవడం జరుగుతుందని కేసులు నమోదైతే అభ్యర్థిత్వం కోల్పోతారని తెలిపారు. అలాగే డ్రై డే ప్రారంభం అవుతుందని ఇందులో భాగముగా మద్యం దుకాణాలు మూసి ఉంచాలన్నారు.

సోమవారం సా.5 గంటల తర్వాత నుండి ఎన్నికల ఫలితాలు వెలువడే వరకు సైలెన్స్ డే గా పరిగణించడం జరుగుతుందని ఈ సమయంలో ఓటర్లు గాని వారు స్థానికేతరులు కాలనీలు వార్డులో సంచరించరాదని ఉండకూడదని హెచ్చరించారు. ఓటర్ల మనసు గెలిచి ఎన్నికల బరిలో గెలవాలి అన్నారు అంతేకానీ ఉచితాలు, బహుమతులు, డబ్బు మద్యం లాంటి వాడితో ఓటర్లను ప్రలోభాలకు గురిచెయొద్దు అలాంటి వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు.

సమస్యలు సృష్టించే అవకాశం ఉన్న వ్యక్తులను గత ఎన్నికల్లో నేరాలకు పాల్పడ్డ వారిని గుర్తించి 73 మెమోలు జారీ చేస్తూ 140 మందిని ముందస్తుగా బైండోవర్ చేయడం జరిగిందని, ఎవరు కూడా బైండోవర్ నిబంధన ఉల్లంగించారాదు, బైండోవర్ అంటే సత్ప్రవర్తన కోసం ఇచ్చే హామీ పత్రమని తెలిపారు నిబంధనలు ఉల్లంఘిస్తే అలాంటి వారిని హామీ పూచికత్తు నగదును రూ.5 లక్షల వరకు జరిమనగా వేయడం జరుగుతుందని అని హెచ్చరించారు.

మొత్తం 17 ఆయుధాలు ఉండగా ఇదివరకే 09 లైసెన్స్ కలిగిన ఆయుధాలను డిపాజిట్ చేయగా, 08 ఆయుధాలు బ్యాంకులలో గార్డ్ బ్యాంక్స్ రక్షణ నిమిత్తము మినహాయింపు ఇచ్చినట్టు తెలిపారు. 23 కేసుల్లో రూ.1.96 లక్షల విలువైన 276 లీటర్ల మద్యం సీజ్ చేశాం అని జిల్లా ఎస్పీ వివరించారు.

Related posts

ఆసుపత్రిలో అగ్గి: ముగ్గురు నవజాత శిశువల మృతి

Satyam News

విద్యాసంస్థల్లో డ్రగ్స్‌పై జీరో టాలరెన్స్ విధానం

Satyam News

కోటకొండ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆకస్మిక తనిఖీ

Satyam News

నిర్మాతగా నా స్థాయిని పెంచే చిత్రం “మఫ్టీ పోలీస్”

Satyam News

వర్ష బాధితుల్ని పట్టించుకోని మంత్రి దామోదర

Satyam News

కొమరవెల్లి మల్లన్న ఆలయం అభివృద్ధి చేసింది మేమే

Satyam News

Leave a Comment