విజయనగరంహోమ్

ప్ర‌ముఖ న్యాయ‌వాది కోల‌గ‌ట్ల త‌మ్మ‌న్నశెట్టి ఆత్మహత్య

ప్ర‌ముఖ న్యాయ వాది,ఏపీ రాష్ట్ర బార్ కౌన్సిల్ నేత కోల‌గ ట్ల త‌మ్మ‌న్న‌శెట్టి(67) బుధ‌వారం ఆత్మహత్య చేసుకున్నారు.నగ‌రంలోని ఎస్వీఎన్ న‌గ‌ర్ స‌మీపం మ‌హాలక్ష్మీ న‌గ‌ర్ లో త‌న సొంత ఇంటిలోనే మూడో అంత‌స్థులో ఆత్మ‌హ‌త్య చేసుకున్నార‌ని విజ‌య‌న‌గ‌రం టూటౌన్ సీఐ శ్రీనివాస‌రావు తెలిపారు.

ఆయ‌న సోద‌రుడు స్వామి ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసి ద‌ర్యాప్తు చేస్తున్నామ‌న్నారు. విజ‌య‌న‌గ‌రంలో బార్ కౌన్సిల్ ఎన్నిక‌ల‌లో త‌మ్మ‌న్న శెట్టి అనూయాయుడే గెలుపొంద‌డంతో ఆయన మనస్తాపం చెందినట్లు తోటి న్యాయ‌వాదులు పేర్కొన్నారు. త‌మ్మ‌న్న‌శెట్టికి ఇద్ద‌రు ఆడ‌పిల్ల‌లు. పెళ్లైన వారిద్ద‌రూ ఆస్ట్రేలియాలోనే ఉంటున్నారు.

న్యాయ‌వాది త‌మ్మ‌న్న‌శెట్టి ఇక లేర‌న్నవార్త తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే బొత్స అప్ప‌ల‌న‌ర‌స‌య్య‌, మాజీఎంపీ బెల్లాన చంద్ర‌శేఖ‌ర్ క‌న్నీరుమున్నీరయ్యారు.

Related posts

విజయ్ జన నాయకన్ చిత్రానికి మళ్లీ అడ్డంకులు

Satyam News

కువైట్‌లో ప్రవాస భారతీయులు అప్రమత్తంగా ఉండాలి

Satyam News

ఘనంగా ముగిసిన జిల్లా పోలీసు వార్షిక క్రీడా సంబరాలు

Satyam News

హెచ్‌ఎస్‌బీసీ రగ్బీ ప్రీమియర్ లీగ్ జట్ల ఖరారు

Satyam News

జలం విలువ తెలియని జగన్ చేసిన నష్టం ఇదీ…..

Satyam News

Corona virus: వుహాన్ ల్యాబ్ కు అమెరికా నిధులు?

Satyam News

Leave a Comment