ముఖ్యంశాలుహోమ్

AE నూకరాజు ఫ్యామిలీ ట్రాజెడీ..సాధిక్‌ ఖాన్‌కు వైసీపీ అండ.!

#AENukarajuAndFamily

రాష్ట్రంలో ఏ ఘోరం జరిగినా, ఏ నేరం వెలుగుచూసినా దాని వెనుక వైసీపీ నేతల హస్తం ఉండటం కామన్ అయిపోయింది. తాజాగా కాకినాడ పంచాయతీరాజ్ AE నూకరాజు కుటుంబం కేసులోనూ ఇదే నిజమైంది. ఈ ఘోరానికి ప్రధాన కారణమైన రైఫిల్ కోచ్ సాధిక్ ఖాన్..వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డికి ముఖ్య అనుచరుడు.

సాధిక్ ఖాన్ కేవలం కోచ్ మాత్రమే కాదు..గుడారిగుంట సమీపంలో ఉన్న ప్రో షూటింగ్ అకాడమీ ఫౌండర్. వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో ఆ పార్టీ నేతల అండదండలతో కాకినాడ JNTU దగ్గర అకాడమీ పెట్టి సాధిక్‌ ఖాన్‌ భారీ నెట్‌వర్క్ నిర్మించుకున్నాడు. వంగా గీత, అప్పటి KUDA చైర్ పర్సన్ రాగిరెడ్డి చంద్రకళా దీప్తి, వక్ఫ్ బోర్డు డైరెక్టర్ అబ్దుల్ బషీరుద్దీన్ లాంటి కీలక నేతలు ఈ అకాడమీ ఓపెనింగ్‌కు చీఫ్ గెస్ట్‌లుగా హాజరయ్యారు. అధికార పార్టీ నేతల భారీ ఫ్లెక్సీలతో అందరినీ తనవైపు తిప్పుకున్నాడు.

ఈ క్రమంలోనే AE నూకరాజు ఫ్యామిలీలోకి ఎంట్రీ ఇచ్చాడు. అతని పదేళ్ల మనవడికి రైఫిల్ నేర్పుతానన్న సాకుతో ఆయన కూతురు సౌజన్యకు దగ్గర్యాడు. సౌజన్యను నమ్మించి, మెల్లగా వారి ఆస్తులన్నీ కాజేశాడు. రోజూ ఇంట్లోకి చొరబడి విచక్షణారహితంగా కొట్టేవాడు. అక్కడితో ఆగకుండా సౌజన్య భర్త జగదీశ్వర్ రెడ్డిని దారుణంగా చంపేశాడు. ఆస్తులు లాక్కోవడమే కాకుండా..నూకరాజు ఫ్యామిలీని మతం మారాలంటూ ఒత్తిడి తెచ్చాడు.

వైసీపీ నేతల అండ చూసుకుని సాధిక్ చేసిన అకృత్యాలు, హింస భరించలేక దిక్కుతోచని స్థితిలో ఆ కుటుంబం మొత్తం గోదావరిలో దూకి ఆత్మహత్య చేసుకుంది. ఇంత ఘోరం జరిగిన వెంటనే సాధిక్ ఖాన్ సునాయాసంగా ఢిల్లీకి పారిపోవడం వెనుక కూడా వైసీపీ పెద్దల సపోర్ట్ ఉందనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. మొత్తానికి రాష్ట్రంలో ఏ అరాచకం జరిగినా దాని మూలాలు వైసీపీలోనే ఉంటున్నాయనేది ఈ ఘటనతో మరోసారి రుజువైంది.

Related posts

తెలంగాణ గిరిజన గురుకులాలు దేశానికే ఆదర్శం

Satyam News

ఆన్‌లైన్‌లో మహానాడు: చంద్రబాబు సంచలన నిర్ణయం

Satyam News

రికార్డులు సృష్టిస్తున్న యువ హాకీ క్రీడాకారిణి జ్యోతి సింగ్

Satyam News

తిరుమలలో శ్రీవారి ధర్మ రథాలకు విశేష ఆదరణ

Satyam News

రికార్డు స్థాయి వృద్ధిరేటు లక్ష్యంగా రాష్ట్ర బడ్జెట్

Satyam News

మోడీ ట్రంప్ మధ్యలో ఎలాన్ మస్క్

Satyam News

Leave a Comment