ముఖ్యంశాలుహోమ్

చంద్రబాబుకు రిలయన్స్ అదిరిపోయే గిఫ్ట్

#Reliance

ఆంధ్రప్రదేశ్‌కు రిలయన్స్ సంస్థ అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పింది. ఏలూరు జిల్లాలో ఏకంగా రూ.2.18 లక్షల కోట్లతో భారీ ప్రాజెక్టును పెట్టబోతోంది. ఈ ప్రాజెక్టుతో ఏపీ ప్రభుత్వానికి ఏకంగా రూ.65,000 కోట్ల ఆదాయం రాబోతోంది. రాష్ట్రంలో ఇంత పెద్ద పెట్టుబడి రావడం మామూలు విషయం కాదు. ఈ ప్రాజెక్ట్ పూర్తయితే ఏపీ రూపురేఖలు మారిపోవడం గ్యారెంటీ.

అసలు ఈ ప్రాజెక్ట్ ఏంటంటే..దీని పేరు అండర్ గ్రౌండ్ కోల్ గ్యాసిఫికేషన్ – UCG. సాధారణంగా బొగ్గు కావాలంటే గనులు తవ్వి బయటకు తీస్తారు కదా.. దీనివల్ల పర్యావరణం పాడవుతుంది. కానీ రిలయన్స్ ఇక్కడ వాడే టెక్నాలజీ వేరు. భూమి లోపల ఉన్న బొగ్గును బయటకు తీయకుండానే, అక్కడికక్కడే గ్యాస్‌లా మార్చేస్తారు. ఆ తర్వాత ఆ గ్యాస్ నుంచి హైడ్రోజన్, మిథనాల్, అమ్మోనియా లాంటివి తయారు చేస్తారు. దీనివల్ల కాలుష్యం ఉండదు, పర్యావరణానికి ఎలాంటి ముప్పు రాదు.

ఈ ప్రాజెక్ట్ వల్ల ఏపీ యువతకు భారీగా ఉపాధి అవకాశాలు రానున్నాయి. ప్లాంట్ ప్రారంభమైతే సుమారు 5 వేల మందికి డైరెక్ట్‌గా ఉద్యోగాలు వస్తాయి. ఇక రవాణా, ఇతర కాంట్రాక్ట్ పనుల ద్వారా మరో 35 వేల మందికి పరోక్షంగా ఉపాధి దొరుకుతుంది. మొత్తంగా 40 వేల మందికి ఈ ప్రాజెక్ట్ వల్ల ఉపాధి లభిస్తుంది. దీంతో ఏలూరు చుట్టుపక్కల ప్రాంతాల్లో వ్యాపారాలు భారీగా పెరగనున్నాయి.

అయితే, ఈ ప్రాజెక్టును రిలయన్స్‌ దశలవారీగా చేయాలనుకుంటోంది. వచ్చే ఏడాది ముందుగా పైలట్ ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తారు. క్షేత్రస్థాయిలో అదెలా పనిచేస్తుందో చూసి, అన్నీ ఓకే అయ్యాక పనుల్లో స్పీడ్ పెంచుతారు. 2030 నాటికి ప్లాంట్‌ను పూర్తిగా అందుబాటులోకి తీసుకురావాలన్నది రిలయన్స్ టార్గెట్. అదే జరిగితే ఇలాంటి సరికొత్త టెక్నాలజీతో నడిచే ప్రాజెక్టుల విషయంలో దేశంలోనే ఏపీ నంబర్ వన్ స్థానంలో నిలుస్తుంది.

Related posts

ఆపద మిత్ర లకు హైడ్రా శిక్షణ పూర్తి

Satyam News

ఇక నుంచి రెగ్యులర్గా వస్తా.ఊరికి చేసేది చాలా ఉంది

Satyam News

బిజిబిజీగా లోకేష్.. పెట్టుబడి దారులతో వరుస మీటింగ్స్‌!

Satyam News

నర్సింగ్ ఆఫీసర్లకు ఇండక్షన్ శిక్షణ కార్యక్రమం

Satyam News

అసెంబ్లీకి వెళ్లకపోతే సీన్ రివర్స్…. వైసీపీ ఎమ్మెల్యేల్లో భయం…!!

Satyam News

నిర్మాతగా నా స్థాయిని పెంచే చిత్రం “మఫ్టీ పోలీస్”

Satyam News

Leave a Comment