26.3 C
Hyderabad
September 19, 2026
సినిమాహోమ్

నిర్మాతగా నా స్థాయిని పెంచే చిత్రం “మఫ్టీ పోలీస్”

#Mohanlal

యాక్షన్ కింగ్ అర్జున్ సర్జ – ఐశ్వర్య రాజేష్ ల పోలీస్ ఇన్వెస్టిగేటివ్ పర్సనల్ డ్రామా “తీయవర్ కులై నడుంగ” తెలుగులో “మఫ్టీ పోలీస్”గా రేపు (ఈనెల 21న) ప్రేక్షకుల ముందుకు రానుంది. దినేష్ లక్ష్మణన్ దర్శకత్వంలో జియస్సార్ అర్ట్స్ బ్యానర్ పై జి. అరుల్ కుమార్ నిర్మించిన ఈ తమిళ చిత్రాన్ని… తెలుగులో “మఫ్టీ పోలీస్” పేరుతో ప్రముఖ నిర్మాత ఎ. ఎన్. బాలాజీ… శ్రీలక్ష్మిజ్యోతి క్రియేషన్స్ ద్వారా విడుదల చేస్తున్నారు. డిస్ట్రిబ్యూటర్ గా 400 పైచిలుకు చిత్రాలు పంపిణీ చేసి, నిర్మాతగా “రంగం-2, యుద్ధభూమి, ఒరేయ్ బామ్మర్ది, డాక్టర్ 56, మై డియర్ భూతం” వంటి చిత్రాలను అందించిన బాలాజీ… “మఫ్టీ పోలీస్” చిత్రం నిర్మాతగా తన స్థాయిని మరింత పెంచుతుందనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు.

ఒక రచయిత హత్య నేపద్యంలో పోలీస్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ గా ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకుల్ని అమితంగా అలరిస్తుందని బాలాజీ పేర్కొన్నారు.  ఇటీవలకాలంలో పిల్లల పాలిట భూతంలా మారిన ఆటిజం వ్యాధి గురించి కూడా ఇందులో చర్చించడం, సదరు వ్యాధి గురించి ప్రజల్లో అవగాహన కల్పించే ప్రయత్నం చేయడం ఈ చిత్రం ప్రత్యేకత అని ఆయన వివరించారు. యాక్షన్ కింగ్ అర్జున్ – ఐశ్వర్య రాజేష్ అలియాస్ భాగ్యంలకు తెలుగునాట ఉన్న క్రేజ్ ని దృష్టిలో పెట్టుకుని అత్యధిక థియేటర్లలో “మఫ్టీ పోలీస్” చిత్రాన్ని విడుదల చేస్తున్నామని, ఈ సినిమాలో యాక్షన్ తోపాటు పర్సనల్ డ్రామా కూడా చాలా ఆసక్తికరంగా ఉంటుందని, తమిళంతోపాటు తెలుగులోనూ అసాధారణ విజయం సాధిస్తుందనే నమ్మకం ఉందని శ్రీలక్ష్మీజ్యోతి క్రియేషన్స్ అధినేత ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు అందించే అవకాశాన్ని అందించిన జి.అరుల్ కుమార్ కి, ఈ చిత్రాన్ని అత్యద్భుతంగా తీర్చిదిద్దిన దర్శకుడు దినేష్ లక్ష్మణన్ లకు బాలాజీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

రామ్ కుమార్ గణేశన్, అభిరామి వెంకటాచలం, ప్రవీణ్ రాజా తదితరులు నటించిన ఈ చిత్రానికి పి.ఆర్.ఒ: ధీరజ్ – అప్పాజీ, ఎడిటింగ్: లారెన్స్ కిషోర్, సినిమాటోగ్రఫీ: భరత్ ఆశీనగన్, మ్యూజిక్: శరవణన్ అభిమన్యు, నిర్మాత: జి.అరుల్ కుమార్, రచన – దర్శకత్వం: దినేష్ లక్ష్మణన్, విడుదల; శ్రీలక్ష్మిజ్యోతి క్రియేషన్స్ – ఎ. ఎన్. బాలాజీ.

Related posts

మోడీ పాలనలో అన్నీ సచ్చే దినాలే… అచ్చే దినాల్లేవు

Satyam News

ఉత్తరప్రదేశ్ లో వర్ష భీభత్సం: 50 మంది మృతి

Satyam News

లక్షలాది మంది భక్తులతో ఇంద్రకీలాద్రి గిరి ప్రదక్షిణ

Satyam News

నాగర్ దొడ్డి గ్రామ వాసికి డాక్టరేట్

Satyam News

ప్రకృతి ప్రసాదించిన ఔషదాల గని కాకర

Satyam News

మెడికల్ విద్యార్థినులకు మెరుగైన వైద్య సేవలందించండి

Satyam News

Leave a Comment