హైదరాబాద్హోమ్

మీరాలం ట్యాంక్ సస్పెన్షన్ బ్రిడ్జి పనులు పర్యవేక్షించిన సీఎం

#MiralamTank

ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి మీరాలం చెరువు అభివృద్ధి పనులను నేడు ప్రత్యక్షంగా పరిశీలించారు. భారీ క్రేన్‌పై నుంచి మీరాలం చెరువు అభివృద్ధి పనులను ఆయన చూశారు.

నిర్దేశించిన గడువులోగా పనులను పూర్తి చేయాలని సీఎం రేవంత్‌ రెడ్డి ఈ సందర్భంగా అధికారులను ఆదేశించారు. చెరువులోకి మురుగు నీరు చేరకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. చెరువు నుంచి మూసీలోకి వరద నీరు సాఫీగా వెళ్లేలా నాలాను విస్తరించాలని ఆదేశించారు.

మీరాలం చెరువును పర్యాటక ప్రాంతంగా మరింత అభివృద్ధి చేసేలా ప్రణాళికలు రూపొందించాలని సీఎం సూచించారు. చెరువులో వాటర్‌ స్పోర్ట్స్‌ నిర్వహించేందుకు అనువైన డిజైన్‌ను రూపొందించాలని, చెరువులో ఉన్న ఐలాండ్లను కూడా అభివృద్ధి చేయాలని తెలిపారు. ఎయిర్‌పోర్టుకు సమీపంలో మీరాలం చెరువు ఉన్నందున పర్యాటకులను ఆకర్షించేలా ప్రత్యేక ఏర్పాట్లు ఉండాలని అధికారులకు సూచించారు. చెరువు పరిసరాలను సుందరీకరించడంతో పాటు సందర్శకులకు ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించేలా అభివృద్ధి పనులు చేపట్టాలని సీఎం స్పష్టం చేశారు.

మీరాలం చెరువుపై నిర్మిస్తున్న సస్పెన్షన్‌ బ్రిడ్జి పనుల పురోగతిని సీఎం స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా అధికారులు ఫొటో ప్రదర్శన ద్వారా చేపడుతున్న పనులు, ఇప్పటివరకు జరిగిన అభివృద్ధిని ముఖ్యమంత్రికి వివరించారు.

Related posts

హెరిటేజ్‌పై కుట్ర…. ఏపీ నుండి సీక్రెట్‌ ఆపరేషన్‌…!!

Satyam News

పవర్ ఫుల్ పవన్ కల్యాణ్ దృష్టి ఇక ఎర్రచందనం పైనే…

Satyam News

నిర్మాతగా నా స్థాయిని పెంచే చిత్రం “మఫ్టీ పోలీస్”

Satyam News

హైడ్రా రంగనాథ్ ను తక్షణమే తొలగించండి

Satyam News

టిటిడి డైరీలు, క్యాలెండర్లకు భ‌క్తుల నుండి విశేష స్పంద‌న‌

Satyam News

కొత్త జిల్లాలలపై ఈనెల 13వ తేదీన జీవోఎం భేటి

Satyam News

Leave a Comment