30.6 C
Hyderabad
September 22, 2026
సంపాదకీయంహోమ్

జగన్ గ్రూప్-1 స్కామ్: వైట్‌నర్ మరకలు, రిసార్ట్ రహస్యాల నివేదిక!

#Jagan

జగన్ హయాంలో జరిగిన గ్రూప్-1 మెయిన్స్ మూల్యాంకన అక్రమాల కేసులో సోమవారం హైకోర్టులో కీలక పరిణామం చోటుచేసుకుంది. జస్టిస్ డి.రమేశ్, జస్టిస్ అవధానం హరిహరనాథ శర్మలతో కూడిన డివిజన్ బెంచ్ ఈ కేసును విచారించింది. సిట్ ఆగస్టు 10న ప్రాథమిక నివేదిక, సెప్టెంబర్ 7న తుది నివేదిక సమర్పించగా — ఈ రెండింటి మధ్య వ్యత్యాసాలు ఉన్నాయని అప్పీల్‌దారుల తరఫు సీనియర్ న్యాయవాది, మాజీ అడ్వకేట్ జనరల్‌ (వై.ఎస్. రాజశేఖర రెడ్డి హయాంలో) సీవీ మోహన్‌రెడ్డి కోర్టు దృష్టికి తెచ్చారు.

దీనికి స్పందించిన కోర్టు, సిట్ నివేదికలతో జతచేసిన మొత్తం దస్త్రాలను అప్పీల్‌దారులకు అందించాలని రిజిస్ట్రార్ (జ్యుడీషియల్)ను ఆదేశించింది. తదుపరి విచారణను సెప్టెంబర్ 24కు వాయిదా వేసింది. అంటే స్పష్టంగా — ఇప్పటివరకు ఇది విచారించిన సాక్ష్యాధారాల నివేదిక దశ మాత్రమే. ఎంపిక ప్రక్రియ చెల్లుతుందా లేదా అనే అప్పీళ్లపై తుది తీర్పు ఇంకా రాలేదు; సిట్ నివేదిక ఆధారంగా బాధ్యులపై ఎలాంటి చర్యలు తీసుకోవాలో కూడా వేరుగా తేలాల్సి ఉంది.

ఇక అసలు కథలోకి వెళ్దాం — ఎందుకంటే ఈ దస్త్రాల్లో వెలుగు చూసిన జగన్ గ్రూప్-1 స్కామ్ విషయాలు సినిమాల్లో కూడా చూసి ఉండం! రాష్ట్రంలో అత్యంత ప్రతిష్టాత్మక ఉద్యోగాల ఎంపిక కోసం జరిగిన గ్రూప్-1 పరీక్ష… జవాబు పత్రాలు రాసింది అభ్యర్థులు, కానీ నిజంగా “మూల్యాంకనం” చేసింది ఎవరో సిట్ నివేదిక ఇప్పుడు బయటపెడుతోంది.

గ్రూప్-1 మూల్యాంకనం ముచ్చటగా మూడు సార్లు చేశారు. కానీ తప్పు మీద తప్పు చేసి అడ్డంగా దొరికిపోయారు.

మామూలుగా అయితే మ్యాన్యువల్‌గా దిద్దాలి. స్కామ్ కోసం హైటెక్ విధానాన్ని ఎంచుకున్నాడు జగన్. మొదట డిజిటల్ మూల్యాంకనం కోసం ఆంజనేయులును దింపాడు. అది చెల్లదని కోర్టు అనగానే.. రెండో సారి చేశారు. జవాబు పత్రాలు స్ట్రాంగ్‌రూమ్‌లో భద్రంగా ఉండాలి. కానీ ఇక్కడ మాత్రం అవి ఏకంగా కోర్టు జప్తులో ఉన్న అగ్రిగోల్డ్ హాయిల్యాండ్ రిసార్ట్‌కు “టూర్” వెళ్లాయి — తాళం చెవి ప్రైవేట్ వ్యక్తి చేతిలో, భద్రత మాత్రం పోలీసులది!

169 ఓఎంఆర్ షీట్లపై వైట్‌నర్ వాడారట. బడి పిల్లాడు తప్పు రాస్తే వైట్‌నర్ వాడొచ్చు, కానీ లక్షలాది మంది భవిష్యత్తును నిర్ణయించే జవాబు పత్రాలపై వైట్‌నర్ వాడితే దాన్ని “కరెక్షన్” అనాలో, “కరప్షన్” అనాలో అర్థం కావట్లేదు! మార్కులను ఎక్సెల్ షీట్‌లో ఎంటర్ చేయించి, డేటా ఎంట్రీ ఆపరేటర్లకు ప్రత్యేక శిక్షణ ఇచ్చారట — ఇది పరీక్షా మూల్యాంకనమా, కరప్షన్ కాల్ సెంటర్ ట్రైనింగా అనే అనుమానం వస్తుంది. మూడో మూల్యాంకనం మూడు చోట్ల కొత్తగా ప్రింట్ చేసి, స్టేపుల్ చేశారు.

ఇంతకీ ఈ మొత్తం వ్యవహారాన్ని హైకోర్టుకు జగన్ హయాంలో ఇచ్చిన అఫిడవిట్లలో కనీసం ప్రస్తావించలేదట. అంటే కోర్టుకే “సర్‌ప్రైజ్” ఇచ్చేశారన్నమాట! 1,14,473 మంది అభ్యర్థులు కేవలం 169 పోస్టుల కోసం నెలల తరబడి కష్టపడి చదివితే, కొందరి భవిష్యత్తు రిసార్ట్‌లో, వైట్‌నర్‌తో, ఎక్సెల్ షీట్లతో నిర్ణయమైందా అనే ప్రశ్న ఇప్పుడు సూటిగా తలెత్తుతోంది.

2024లోనే న్యాయస్థానం రెండో, మూడో మూల్యాంకనాలు చట్టవిరుద్ధమని తేల్చి, మళ్లీ పరీక్ష పెట్టాలని ఆదేశించింది. ఇప్పుడు సిట్ దర్యాప్తులో 736 మంది అభ్యర్థుల దస్త్రాలు, ఫోరెన్సిక్ ఆధారాలు, 173 మంది సాక్షుల వాంగ్మూలాలు జతయ్యాయి.

అవే ఇప్పుడు అప్పీల్‌దారులకు ఇప్పించి చూసుకోమంది కోర్టు. మెరిట్‌ను నమ్ముకుని ఉద్యోగం రాక వెలుపల మిగిలిన యువత ఇప్పటికీ ప్రశ్నిస్తూనే ఉంది. కానీ ఇదే కేసులో మరో పక్షం కూడా ఉంది — ఇప్పటికే ఎంపికై, షరతులతో కూడిన (కండిషనల్) నియామకాలతో ఉద్యోగాల్లో చేరి, విధులు నిర్వర్తిస్తున్నవారు. వీళ్ల పరిస్థితి మరింత ఇరకాటంలో పడింది. ఎందుకంటే వీళ్ల ఉద్యోగ భద్రత మొత్తం ఈ కేసు తీర్పుపైనే ఆధారపడి ఉంది.

“మేం సెలెక్ట్ అయ్యాం, మమ్మల్ని ఉద్యోగాలు చేసుకొనివ్వండి” అని వీళ్లు వాదిస్తున్నా, మొత్తం మూల్యాంకన ప్రక్రియే ప్రశ్నార్థకమైతే  నిజాయితీగా సెలెక్ట్ అయినవారు కూడా అనుమానపు నీడలో నిలబడాల్సిన పరిస్థితి ఏర్పడింది. అందుకే వీరు కూడా ధర్మాసనం ముందు ప్రత్యేకంగా అప్పీళ్లు వేశారు — తమ ఉద్యోగాలు చేసుకోవడానికి.

అంటే ఇక్కడ మూడు వర్గాలు నిలబడ్డాయి:

ఎంపిక కాని అభ్యర్థులు — “మాకు అన్యాయం జరిగింది, మళ్లీ మెయిన్స్ పరీక్ష జరగాలి” అంటున్నవారు.

కండిషనల్‌గా ఉద్యోగాల్లో ఉన్నవారు — “మా ఎంపిక సరైనదే, మా భవిష్యత్తు గాలిలో దీపం కాకూడదు” అంటున్నవారు.

నిందితులు — అత్యున్నత ఏపీపీఎస్సీ గౌరవ ప్రతిష్టలను మంటలో కలిపిన స్కామర్లు.

జగన్ మూడు మూల్యాంకనాలతో.. ఈ మూడు కోణాల మధ్య నలిగిపోతున్నది మాత్రం మెరిట్ అభ్యర్థులే. ఇలాంటి నియామకాలు పారదర్శకంగా జరిగితేనే ఎవరికైనా ప్రశాంతత. ఏదైనా స్కామ్‌గా మార్చే జగన్ లాంటి జలగలను కుర్చీలోంచి దింపి దులిపేసినా.. ఆ జలగ పీల్చేది ప్రశాంతతనే కాదు, వ్యవస్థల మీద నమ్మకాన్ని కూడా!

Related posts

జగన్‌కు మరో బిగ్‌షాక్‌…. భారతి సిమెంట్‌ లీజు రద్దు!

Satyam News

మావిగన్‌పై జగన్‌ కోరిక తీరాలంటే.. చంద్రబాబు మరో 3 సార్లు..!!

Satyam News

నిర్మలమ్మ బడ్జెట్ లో తెలంగాణకు గుండు సున్నా

Satyam News

ఆ ఒక్క నిర్ణయం క్రికెట్ గతిని మార్చింది…

Satyam News

టెహ్రాన్ చమురు నిల్వలపై ఇజ్రాయిల్ దాడి

Satyam News

మంత్రాలయం శ్రీ మంచాలమ్మకు ప్రత్యేక అలంకరణ

Satyam News

Leave a Comment