విశాఖపట్నంహోమ్

పిఠాపురం కాలనీలో కలకలం.. డ్రైనేజీలో పసికందు

#vizag

విశాఖపట్నంలోని పిఠాపురం కాలనీలో అమానవీయ ఘటన చోటుచేసుకుంది. డ్రైనేజీలో గోనెసంచిలో అప్పుడే పుట్టిన పసికందును గుర్తుతెలియని వ్యక్తులు పడేశారు. శిశువు ఏడుపు శబ్దాలు విన్న స్థానికులు డ్రైనేజీలో పరిశీలించగా గోనెసంచిలో చిన్నారి కనిపించింది. వెంటనే స్పందించిన స్థానికులు పసికందును బయటకు తీసి ప్రాణాలు కాపాడారు. ఘటనపై వెంటనే ఎంవీపీ పోలీసులకు సమాచారం అందించారు.

సమాచారం అందుకున్న ఎస్సై సీతారాం హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. చిన్నారిని మెరుగైన వైద్యం కోసం కేజీహెచ్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం పసికందు క్షేమంగా ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. అప్పుడే పుట్టిన శిశువును డ్రైనేజీలో పడేసిన గుర్తుతెలియని వ్యక్తుల కోసం పోలీసులు ఆరా తీస్తున్నారు. ఈ అమానవీయ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Related posts

ఎర్రకోట పేలుళ్ల ఘటనలో కీలక అరెస్టు

Satyam News

అరవింద్ కేజ్రీవాల్ పై కోర్టు ధిక్కరణ కేసు

Satyam News

శభాష్ సువేందు: చికెన్ నెక్ ప్రాంతం కేంద్రానికి…

Satyam News

సజ్జల నన్ను కొట్టాడు.. విజయసాయి బాధ!

Satyam News

తెలంగాణ పర్యాటక సంస్కరణలకు నీతి ఆయోగ్ ప్రశంస

Satyam News

సింగూర్ కాల్వలకు మరమ్మతులు చేయాలి

Satyam News

Leave a Comment