సినిమాహోమ్

విజయ్ దేవరకొండకు భానుప్రకాశ్ రెడ్డి అండ

ప్రముఖ సినీ నటుడు విజయ్ దేవరకొండకు బీజేపీ నాయకుడు, తిరుమల తిరుపతి దేవస్థానాల బోర్డు మాజీ సభ్యుడు జీ. భాను ప్రకాశ్ రెడ్డి బాసటగా నిలిచారు. ఔరంగజేబు లాంటి వాడు కనిపిస్తే మూడు సార్లు చెంప పగలగొడతానని విజయ్ దేవరకొండ ఒక సభలో వ్యాఖ్యానించగా దాన్ని కొందరు ఖండించడాన్ని భానుప్రకాశ్ రెడ్డి తీవ్రంగా తప్పుపట్టారు. విజయ్ దేవర కొండ మాట్లాడిన ప్రతి మాటని నేను సమర్ధిస్తున్నాను, వారితో నేను ఏకీభవిస్తున్నాను. వారి మాట లాంటి మాటల్లో ఔరంగజేబు కనబడితే 3 సార్లు ” చెంపలు వాయిస్తాను” అని చెప్పారు. నేనైతే “తోలు తీస్తాను” అని చెప్తున్నా అని ఆయన అన్నారు. ఎందుకంటే ఔరంగజేబు చేసిన దుర్మార్గాలు, వాళ్ల రాక్షస ప్రవృత్తి వందలాది హిందూ దేవాలయాలను ధ్వంసం చేయడం తీవ్రమైన నేరాలని అన్నారు. హిందూ ధర్మంపై ప్రత్యక్షంగా, పరోక్షంగా దాడి చేయడం జరిగింది. హిందూ స్త్రీలని అవమానపరచడం జరిగింది. అంతే కాకుండా, పూర్తిగా ఒక హిందూ వ్యతిరేకిగా ఆయన వ్యవహరించాడు. అలాంటి వారిని సమర్థిస్తామా అని భాను ప్రకాశ్ రెడ్డి ప్రశ్నించారు.

పూర్తి వివరాల కోసం వీడియో చూడండి:

Related posts

అరటి తోటలను పరిశీలించిన కేంద్ర బృందం

Satyam News

ఇది కొంచెం పెద్ద విషయమే… ఓపిగ్గా చదవండి

Satyam News

ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయిన ధర్మేంద్ర

Satyam News

ఇరాన్ యుద్ధంపై త్వరలో శుభవార్త

Satyam News

జమ్మూలో బీజేపీ అభ్యర్ధి ఘన విజయం

Satyam News

కాంగ్రెస్ వేధింపులతో బిజెపి నాయకుడు ఆత్మహత్య

Satyam News

Leave a Comment