సంపాదకీయంహోమ్

చంద్రబాబు విజన్‌కు ది ప్రింట్ సలామ్

#chandra

ఏపీని వరుసగా ముంచెత్తుతున్న తీవ్ర తుపాన్ల నుంచి ప్రజలను కాపాడడంలో CM చంద్రబాబు చూపించిన చొరవ, విజనరీ లీడర్‌షిప్‌పై జాతీయ స్థాయిలో ప్రశంసల వర్షం కురుస్తోంది. విపత్తు నిర్వహణను కేవలం రెస్క్యూ ఆపరేషన్‌లా కాకుండా, సాంకేతికతను మిళితం చేస్తూ ఓ ప్రయోగంలా నిర్వహించడంలో చంద్రబాబు తన మార్కును మరోసారి నిరూపించుకున్నారు. ప్రముఖ జాతీయ డిజిటల్ మీడియా సంస్థ  ది ప్రింట్ సైతం చంద్రబాబు ప్రొయాక్టివ్ గవర్నెన్స్‌పై ప్రశంసలు కురిపించింది. విపత్తులను జయించడంలో మిగతా రాష్ట్రాల ముఖ్యమంత్రులకు చంద్రబాబు రోల్ మోడల్‌గా నిలిచారని ది ప్రింట్ ప్రశంసించింది.

వరదలు, తుపాన్ల వేళ ప్రభుత్వ యంత్రాంగం ఎలా పనిచేయాలో చంద్రబాబు తన సుదీర్ఘ అనుభవంతో మరోసారి చేసి చూపించారని పేర్కొంది. విపత్తు రాకముందే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత అధునాతన వాతావరణ అంచనాలను ఉపయోగించడం, ముందస్తు డేటాను విశ్లేషించి సహాయక బృందాలను రంగంలోకి దించడం వంటి నిర్ణయాలు ప్రాణనష్టాన్ని దాదాపు జీరోకు పరిమితం చేశాయని స్పష్టం చేసింది. దెబ్బతిన్న విద్యుత్ రంగాన్ని వేగంగా పునరుద్ధరించేందుకు పొరుగు రాష్ట్రాల డిస్కం సిబ్బందిని సైతం ముందే ఏపీకి రప్పించేలా ఆయన చేసిన వ్యూహాత్మక ఏర్పాట్లు, సుదీర్ఘ ఆలోచనా ధోరణి ఆయనకున్న అపారమైన పాలనా అనుభవానికి ప్రత్యక్ష నిదర్శనంగా అభివర్ణించింది.

70 ఏళ్ల వయస్సులోనూ విశ్రాంతి లేకుండా అర్ధరాత్రి వేళల్లో సైతం అధికారులతో గ్రౌండ్ లెవెల్ రివ్యూలు నిర్వహించడం, క్షేత్రస్థాయిలో నీటమునిగిన పంట పొలాల్లోకి స్వయంగా దిగి రైతులకు భరోసానివ్వడం చంద్రబాబు నైజమని…ముఖ్యమంత్రి స్వయంగా కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచే కాకుండా, జిల్లాల పర్యటనలతో యంత్రాంగంలో నిరంతరం ఉత్సాహాన్ని నింపడం వల్లనే స్వల్ప వ్యవధిలోనే రెస్క్యూ నుంచి పునరావాస చర్యల వైపు రాష్ట్రం వేగంగా అడుగులు వేయగలిగిందని తెలిపింది.

ఒక వైపు సంక్షేమం, మరోవైపు వేగవంతమైన అభివృద్ధిని పరుగులు తీయిస్తూనే.. విపత్తుల వేళ ప్రజలకు కొండంత అండగా నిలిచే సిసలైన లీడర్ అని చంద్రబాబు మరోసారి నిరూపించుకున్నారని ప్రింట్ పేర్కొంది. విపత్తు నిర్వహణలో  ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సాధించిన విజయం, చంద్రబాబు నాయకత్వ పటిమ ఇతర రాష్ట్రాలకు ఒక  మాస్టర్‌క్లాస్ లాంటి పాఠమని ది ప్రింట్ స్పష్టం చేసింది.

Related posts

రాజ్యసభలో జగన్ కేసుల ప్రస్తావనతో వైసీపీ లో అలజడి

Satyam News

సింగపూర్ ‘ట్రీ లేడీ’ ఆకస్మిక మరణం

Satyam News

పులివెందుల గడ్డపై పచ్చ జెండా.. సోదిలో కూడా లేని వైసీపీ

Satyam News

మానవహక్కుల మండల్ ఉపాధ్యక్షుడిగా చించొలే

Satyam News

సుప్రీంకోర్టు వ్యాఖ్యల్ని తప్పుగా ప్రచారం చేస్తున్న వైసీపీ

Satyam News

బాలీవుడ్ లెజెండ్ ధర్మేంద్ర కన్నుమూత

Satyam News

Leave a Comment