ముఖ్యంశాలుహోమ్

యంగ్ ఇండియా పోలీస్ స్కూల్‌కు రూ.50 లక్షల విరాళం

#YoungIndiaSchool

యంగ్ ఇండియా పోలీస్ స్కూల్‌లో విద్యా మౌలిక వసతుల అభివృద్ధికి ఆప్టిమస్ గ్రూప్ ఛైర్మన్, మేనేజింగ్ పార్ట్‌నర్ డాక్టర్ డి. శ్రీనివాసరెడ్డి రూ.50 లక్షల విరాళం అందించారు. మంగళవారం మైండ్‌స్పేస్‌లోని పెరెల్ క్లబ్‌లో నిర్వహించిన ఓపెన్ హౌస్ సమావేశంలో డీజీపీ సీవీ ఆనంద్‌కు విరాళం చెక్కును అందజేశారు. ఈ విరాళాన్ని పాఠశాలలో తరగతి గదులు, సైన్స్, టెక్నాలజీ ప్రయోగశాలలు, గ్రంథాలయం, క్రీడా వసతులు, డిజిటల్ విద్యా సదుపాయాల అభివృద్ధికి వినియోగించనున్నారు. పోలీసు సిబ్బంది పిల్లలతోపాటు సాధారణ ప్రజల కుటుంబాలకు చెందిన పిల్లలకు కూడా సమాన ప్రాతిపదికన నాణ్యమైన విద్య అందించడమే ఈ పాఠశాల ప్రధాన లక్ష్యమని నిర్వాహకులు తెలిపారు.

విరాళం అందించిన డాక్టర్ శ్రీనివాసరెడ్డిని డీజీపీ సీవీ ఆనంద్ అభినందించారు. యంగ్ ఇండియా పోలీస్ స్కూల్‌లో అత్యుత్తమ విద్యా ప్రమాణాలను నెలకొల్పేందుకు పారిశ్రామిక, వాణిజ్య సంస్థలు, దాతలు ముందుకొచ్చి సహకరించాలని పిలుపునిచ్చారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యతోపాటు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, క్రీడలు, ఇతర రంగాల్లో మెరుగైన అవకాశాలు కల్పించేలా పాఠశాలను అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందన్నారు.

ఈ సందర్భంగా డాక్టర్ శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ పోలీసులంటే తనకు ఎంతో గౌరవమని, సమాజ భద్రత కోసం వారు అందిస్తున్న సేవలు ప్రశంసనీయమని పేర్కొన్నారు. పోలీసు కుటుంబాల పిల్లల విద్యాభివృద్ధికి తన వంతు సహకారం అందించాలనే ఉద్దేశంతో ఈ విరాళం అందించినట్లు తెలిపారు. విద్య ద్వారా సమాజంలో సానుకూల మార్పు తీసుకురావడమే తమ లక్ష్యమని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో సైబరాబాద్ పోలీస్ కమిషనర్ రమేష్, సైబరాబాద్ మున్సిపల్ కమిషనర్ సృజన, ఎస్‌ఎస్‌సీ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సభ్యులు, ఐటీ రంగ సంస్థలు, ఆర్టీసీ, ఇతర సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.

Related posts

టీ20 వరల్డ్ కప్ నుంచి బంగ్లాదేశ్ ఔట్ !

Satyam News

నర్సంపేట వ్యవసాయ మార్కెట్ యార్డు సందర్శించిన కేటీఆర్

Satyam News

ఆశ్చర్యకరంగా శుభ్‌మన్ గిల్‌ కు ఉద్వాసన

Satyam News

డ్రిప్‌ ఇరిగేషన్‌ నుంచి హార్టీకల్చర్ హబ్‌ వరకు!

Satyam News

విద్యుత్ సమస్యలు ఎదురైతే పరిష్కరించడానికి సిద్ధం

Satyam News

సంచలన నిర్ణయం తీసుకున్న తమిళనాడు దళపతి

Satyam News

Leave a Comment