సంపాదకీయంహోమ్

జగన్‌ని భయపెట్టిన విజయ్‌, కేటీఆర్‌!

#JaganVijayKTR

చెన్నైలో వైఎస్‌ అనిల్ రెడ్డి కుమార్తె వివాహ వేడుక గ్రాండ్‌గా జరిగింది. ఈ హై ప్రొఫైల్ ఈవెంట్‌కు తమిళనాడు CM, TVK అధినేత దళపతి విజయ్, BRS వర్కింగ్ ప్రెసిడెంట్ KTR, మాజీ సీఎం వైఎస్ జగన్ కూడా హాజరయ్యారు. వేదికపై వారంతా ఒకే ఫ్రేమ్‌లో నిలిచి ముచ్చటించుకున్న ఫోటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో  వైరల్ అవుతున్నాయి. అయితే, ఈ కలయిక కేవలం శుభకార్యానికి మాత్రమే పరిమితం కాకుండా..దక్షణాది రాజకీయాల్లో ఈ ముగ్గురు యువ నేతల గ్రాఫ్‌లు ఏ దిశగా వెళ్తున్నాయనే చర్చకు తెరలేపింది.

ఒకే వేదికపై కనిపిస్తున్నప్పటికీ, ఈ ముగ్గురు నేతల రాజకీయ పథం, ప్రస్తుత ఇమేజ్ మాత్రం వేర్వేరుగా ఉన్నాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. తమిళనాడులో TVK పేరుతో పార్టీ స్థాపించి అతి తక్కువ సమయంలోనే తమిళనాడు సీఎంగా భాధ్యతలు చేపట్టి, రికార్డు స్థాయి ప్రజాదరణను విజయ్ సొంతం చేసుకున్నారు. ఆయనకు ఉన్న క్రేజ్, పొలిటికల్ మాస్ ఇమేజ్ దక్షణాది రాజకీయాల్లోనే సంచలనంగా మారింది. మరోవైపు తెలంగాణలో అధికారం కోల్పోయినప్పటికీ BRS నేత కేటీఆర్ నిరంతరం ప్రజాక్షేత్రంలోనే ఉంటూ, విపక్ష నాయకుడిగా ప్రభుత్వ వైఫల్యాలపై రోడ్లపైకి వచ్చి పోరాడుతున్నారు. ఓటమి తర్వాత కూడా తన ఇమేజ్‌ను, కేడర్ గ్రాఫ్‌ను తగ్గకుండా కాపాడుకోవడంలో కేటీఆర్ సక్సెస్ అయ్యారు.

అయితే ఏపీలో మాత్రం పరిస్థితి అందుకు భిన్నంగా తయారైందనే ఆందోళన వైసీపీ వర్గాల్లో వ్యక్తమవుతోంది. 2024 ఎన్నికల ఘోర పరాజయం తర్వాత వైఎస్ జగన్ ఇమేజ్ రోజురోజుకూ డౌన్ అవుతుందనే విమర్శలు వస్తున్నాయి. కేటీఆర్‌లాగా ఓటమిని తట్టుకుని నిరంతరం ప్రజల్లో ఉండటంలోగానీ, విజయ్‌లాగా నయా ట్రెండ్ సెట్ చేసే వ్యూహాలను అమలు చేయడంలోగానీ జగన్ వెనుకబడ్డారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా కూడా దక్కని పరిస్థితుల నుంచి పార్టీని గట్టెక్కించడానికి జగన్ అనుసరిస్తున్న తీరు సొంత కేడర్‌కే మింగుడుపడటం లేదు.

చెన్నై పెళ్లి వేడుకలో విజయ్, కేటీఆర్‌లతో జగన్ చిరునవ్వులు చిందిస్తూ కనిపించినప్పటికీ..వారిద్దరి గ్రాఫ్, సక్సెస్ రేట్‌తో పోలిస్తే జగన్‌ గ్రాఫ్‌ అంతకంతకూ పడిపోతోంది. ఒకవైపు విజయ్ తమిళనాడులో దూసుకుపోతుండగా, మరోవైపు కేటీఆర్ రీ-బ్రాండింగ్‌తో కేడర్‌ను కాపాడుకుంటున్నారు. కానీ ఈ ముగ్గురిలో జగన్ ఇమేజ్ మాత్రం బాగా తగ్గిపోతుండటంతో వైసీపీ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది.

Related posts

వైకుంఠ ఏకాదశి ఏర్పాట్లపై టీటీడీ సమీక్ష

Satyam News

గూగుల్ కు విశాఖే ఎందుకు నచ్చింది?

Satyam News

ముఖ్యమంత్రి సహాయ నిధికి ఎస్‌బీఐ రూ.5 కోట్ల విరాళం

Satyam News

పంజాబ్ లో అద్భుతం: 90శాతం మందికి కరెంటు బిల్లు లేదు…

Satyam News

ఎట్టకేలకు ఈడీ విచారణకు వచ్చిన ‘‘కాపు టైగర్’’

Satyam News

21 వ తేదీ నుండి సరస్వతీ నదీ అంత్య పుష్కరాలు

Satyam News

Leave a Comment