ప్రపంచంహోమ్

అమెరికాను మరో మారు హెచ్చరించిన ఇరాన్

#IranArmyChiefAmirHatami

అమెరికా ఇరాన్ మధ్య హెచ్చరికలు రోజు రోజుకు తీవ్ర రూపం దాలుస్తున్నాయి. తాజాగా ఇరాన్‌ సైన్యాధిపతి అమీర్‌ హతామీ అమెరికాకు తీవ్ర హెచ్చరిక జారీ చేశారు. అమెరికా మరోసారి ఇరాన్‌పై దాడులకు పాల్పడితే గతంలో కంటే మరింత విధ్వంసకరమైన రీతిలో ప్రతిస్పందిస్తామని స్పష్టం చేశారు.

ఇరాన్‌కు చెందిన ఫార్స్‌ వార్తా సంస్థ వెల్లడించిన వివరాల ప్రకారం, హతామీ మాట్లాడుతూ గతంలో శత్రువులను తీవ్ర ఇబ్బందుల్లోకి నెట్టిన చర్యలను అమెరికా మరోసారి పునరావృతం చేస్తే, ఈసారి మా ప్రతిస్పందన మరింత తీవ్రంగా ఉంటుందని పేర్కొన్నారు. అమెరికాతో పాటు దానికి అండగా నిలిచే దేశాలపై కూడా ప్రతీకార చర్యలు ఉంటాయని, ఈ దాడులకు భౌగోళిక సరిహద్దుల పరిమితులు ఉండబోవని హెచ్చరించారు.

అమెరికా, ఇరాన్‌ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ ఈ ప్రతిదాడులు అమెరికా సైనిక బలగాలతో పాటు ఆ దేశానికి మద్దతుగా నిలిచే మిత్రదేశాలను కూడా లక్ష్యంగా చేసుకుంటాయని హెచ్చరించారు.

 

Related posts

కారుణ్య మ‌ర‌ణాల‌కు ఇక మార్గం సుగ‌మం

Satyam News

చిన్నారి అదృశ్యం ఘటనపై పవన్ కళ్యాణ్ ఆరా

Satyam News

యంగ్‌ ఇండియా పోలీస్‌ స్కూల్‌కు అరోబిందో రూ.కోటి విరాళం

Satyam News

పాస్టర్ కొడుకు పై అత్యాచారం ఫిర్యాదు

Satyam News

‘ప్రభుత్వ సారాయి దుకాణం’ చిత్ర టీజర్ లాంచ్

Satyam News

శ్రీ స్వామి రామానందుల వారి సమాధి ఆరాధన

Satyam News

Leave a Comment