చిలుక ద్వాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని నెల్లూరు రంగనాయకులపేటలోని శ్రీ తల్పగిరి రంగనాథ స్వామి వారి దేవస్థానంలో శనివారం ప్రత్యేక ఆధ్యాత్మిక కార్యక్రమాలు వైభవంగా నిర్వహించారు. ఉదయం 7.30 గంటలకు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ రంగనాథ స్వామి వారికి తిరుమంజనం నిర్వహించారు.
సాయంత్రం 6.30 గంటలకు బంగారు గరుడసేవ పేట ఉత్సవంలో భాగంగా స్వామివారు ఉత్తరాది మఠం (శ్రీ ఆంజనేయ స్వామి వారి దేవస్థానం) వద్దకు వేంచేశారు. అక్కడ శ్రీ రంగనాథ స్వామి వారికి, శ్రీ తులసి అమ్మవారికి తులసి కల్యాణం అత్యంత వైభవంగా నిర్వహించారు. అనంతరం స్వామివారి పేట ఉత్సవం జరిగింది. ఈ కార్యక్రమాలకు ఉభయకర్తలుగా దివంగత వేముగుంట రాఘవేంద్రరావు కుమారులు వ్యవహరించారు.
ఈ కార్యక్రమంలో దేవస్థానం కార్యనిర్వహణాధికారి ఆళ్ళ శ్రీనివాసరెడ్డి, చైర్మన్ లెక్కల వెంకటరెడ్డి, ధర్మకర్తల మండలి సభ్యులు దూబిశెట్టి కల్యాణి, బొద్దుకూరు వెంకటలక్ష్మి, కొత్త వెంకట సుబ్రహ్మణ్యం, జూటూరు మహేష్ కుమార్ శర్మ, వీరెపల్లి పద్మజ, అద్దంకి చంద్రశేఖర్, తుమ్మకూరు రాజమోహన్, తలపుల ఉమామహేశ్వరి, బాసికల చిరంజీవి, దోర్నాల రాధిక, ఎక్స్-అఫీషియో సభ్యుడు ఈ. దొరస్వామి, దేవస్థాన అర్చకులు, సిబ్బంది, పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
