గుంటూరుహోమ్

తదుపరి సీఎస్ ఎవరు?

#KVijayanandIAS

రాష్ట్ర ప్రభుత్వ తదుపరి ప్రధాన కార్యదర్శి ఎవరు అనే అంశం కొత్త ఉత్కంఠకు తెరలేపుతున్నది. ప్రస్తుత రాష్ట్ర ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి విజ‌యానంద్ ఈ నెలాఖ‌రుకు రిటైర్ కాబోతున్నారు. ఆయ‌న స్థానంలో సీనియ‌ర్ ఐఏఎస్ సాయి ప్ర‌సాద్‌ను నూత‌న‌ ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శిగా నియ‌మించ‌బోతున్నార‌ని తెలిసింది.

అధికార కూట‌మిలో ప్ర‌ధాన పార్టీ అయిన తెలుగుదేశం పార్టీ కూడా ఆయ‌న‌ను ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శిగా నియ‌మించాల‌నే భావ‌న‌తో ఉంది. ఆ పార్టీని స‌మ‌ర్థించే ప్ర‌ధాన సామాజిక‌వ‌ర్గం కూడా త‌మ సామాజిక‌వ‌ర్గానికి ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ప‌ద‌వి ఇప్ప‌టి వ‌ర‌కూ ద‌క్క‌లేద‌ని, ఇప్పుడు ఆ అవ‌కాశం వ‌చ్చింద‌ని ఇప్పుడు సాయిప్ర‌సాద్‌ను సిఎస్‌గా నియ‌మించాల‌ని గ‌ట్టిగా కోరుతోంది.

దీనిపై ఇప్ప‌టికే ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబునాయుడుపై ఒత్తిడి తెస్తోంది. వాస్త‌వానికి విజ‌యానంద్ కంటే ముందుగానే సాయిప్ర‌సాద్‌కు ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ప‌ద‌వి ఇవ్వాల‌ని అప్ప‌ట్లో కోరినా బీసీ వ‌ర్గానికి చెందిన విజ‌యానంద్‌కే చంద్ర‌బాబు ప్రాధాన్య‌త ఇచ్చారు. విజ‌యానంద్ త‌రువాత సాయిప్ర‌సాద్‌కు అవ‌కాశం ఇస్తాన‌ని చంద్ర‌బాబు ఆ సామాజిక‌వ‌ర్గానికి హామీ ఇచ్చారు.

ఇప్పుడు ఆ హామీని ఆయ‌న నెర‌వేరుస్తార‌నే భావ‌న వ్య‌క్తం అవుతోంది. విజ‌యానంద్ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు ఇష్టుమైన వాడే. విద్యుత్‌రంగంలో అపారనుభ‌వం ఉన్న ఆయ‌నంటే చంద్ర‌బాబుకు చాలా మ‌క్కువ‌. ఇప్పుడా మ‌క్కువ‌తోనే..ఆయ‌న‌కు మ‌రో ఆరు నెల‌లు ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శిగా పొడిగింపు ఇస్తార‌నే ప్ర‌చారం ఉంది. అయితే..దాదాపు ఆయ‌న‌కు పొడిగింపులేన‌ట్లేన‌ని, నూత‌న సిఎస్‌గా సాయిప్ర‌సాద్ ఎంపిక కావ‌డం లాంఛ‌న‌మ‌నే అభిప్రాయాలు ఉన్నాయి.

ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శిగా విజ‌యానంద్‌కు స‌ర్వీసు పొడిగింపులేక‌పోయినా..ఆయ‌న‌ను విద్యుత్ శాఖ కార్య‌ద‌ర్శిగా కొన‌సాగిస్తారంటున్నారు. ఇప్పుడు ఆయ‌న ప్ర‌భుత్వ కార్య‌ద‌ర్శి ప‌ద‌వితో పాటు విద్యుత్‌శాఖ కార్య‌ద‌ర్శిగా ఉన్నారు. ఈనెలాఖ‌రుకు ఆయ‌న రిటైర్ అయినా..విద్యుత్‌శాఖ కార్య‌ద‌ర్శిగా ఆయ‌న కొన‌సాగుతార‌ని, ఆయ‌న స‌ర్వీసును పొడిగిస్తార‌నే ప్ర‌చారం ఉంది.

గ‌తంలో స‌ర్వీసు నుంచి రిటైర్ అయిన రాజ‌శేఖ‌ర్‌ను ఎలా కొన‌సాగిస్తున్నారో..అదే విధంగా..విజ‌యానంద్‌ను కొన‌సాగిస్తారంటు న్నారు. ఉమ్మ‌డి రాష్ట్రంలో కిర‌ణ్‌కుమార్‌రెడ్డి ముఖ్య‌మంత్రిగా ఉన్న‌ప్ప‌టి నుంచి విజ‌యానంద్ విద్యుత్‌శాఖ‌ను చూస్తూనే ఉన్నారు. ముఖ్య‌మంత్రులు మారినా..ఆయ‌న పోస్టు మాత్రం మార‌డం లేదు. ఇప్పుడు ఆయ‌న రిటైర్ అయినా విద్యుత్‌శాఖ కార్య‌ద‌ర్శిగా ఆయ‌న‌నే చంద్ర‌బాబు కొన‌సాగిస్తార‌నే ప్ర‌చారం ఉంది.

కాగా..విద్యుత్ ఛార్జీల పెంపు, విద్యుత్ ఒప్పందాల్లో అవినీతికి ఆయ‌నే కార‌ణ‌మ‌ని ఆయ‌న వ్య‌తిరేకులు ప్ర‌చారం చేస్తుంటారు. అయితే..విద్యుత్ రంగంలో గొప్ప సంస్క‌ర‌ణ‌లు తేవ‌డంలో..ఆయ‌న కీల‌క పాత్ర పోషించార‌ని ఆయ‌న అనుకూలురు చెబుతుంటారు. మొత్తం మీద ఆయ‌న స‌ర్వీసు నుంచి రిటైర్ అయినా.. విద్యుత్‌శాఖ‌లో ఆయ‌నే కీల‌కంగా వ్య‌వ‌రిస్తార‌నే అంచనాలు ఉన్నాయి.

Related posts

సైకోలకు షాక్ ట్రీట్‌మెంట్: రంగంలోకి సోషల్ మీడియా టాస్క్‌ఫోర్స్!

Satyam News

సుదూర లక్ష్యాలను చేధించే కుశ సిద్ధం చేసిన భారత్

Satyam News

60 ఏళ్లు పైబడిన జర్నలిస్టులకు చికిత్సపై 75% తగ్గింపు

Satyam News

తిరుమలలో ‘కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం’

Satyam News

రాష్ట్రం లో వంట గ్యాస్ కొరత లేదు

Satyam News

సోనియా గాంధీ కేసు హైకోర్టు కు….

Satyam News

Leave a Comment