కడపహోమ్

వైభవంగా శ్రీ మాధవరాయ మహోత్సవం

కడప జిల్లా మైదుకూరులో వెలసిన భూదేవి శ్రీదేవి సమేత శ్రీ లక్ష్మీ మాధవరాయ స్వామి ఊరేగింపు మహోత్సవం అంగరంగ వైభవం గా జరిగింది.

అత్యంత వైభవంగా మీరుమిట్లు గోలిపే టపాసుల తారాజువ్వలు పండుగ వాతావరణం లో సంక్రాంతి మూడవ రోజు అయిన కనుమ పండుగ నాడు అశేష జన సందోహం మధ్య స్వామి వారి పల్లకి ఊరేగింపు మహోత్సవం నిర్వహించారు.

కోలాటం, కేరళ వాయిద్యాలతో, చిలక వేశాధారణలో నృత్యంలు ప్రజలను ఆకర్శించే విధంగా కార్యక్రమాలు జరిగాయి. ఈ మాధవరాయ స్వామి సంక్రాంతికి పారువేటగా బయలుదేరి మైదుకూరు చుట్టుపక్కల 16 గ్రామాలలో అంగరంగ వైభవంగా ఊరేగింపబడతారు.

ప్రతి గ్రామానికి వెళ్లిన రోజు మాధవరాయ స్వామికి వైభవంగా పూజలు చేసి ఊరేగింపు చేపట్టి ఆ గ్రామంలో ఆ రోజును పండుగగా గ్రామప్రజలు చేసుకుంటారు. ఇది అనేక తరాలుగా ఆనవాయితీగా వస్తుంది.

Related posts

గృహ ప్రవేశం లో గుండె పోటు… సో.. శాడ్

Satyam News

Satyam News

వై.ఎస్.జ‌గ‌న్ వి హింసా రాజకీయాలు

Satyam News

శ్రీరంగం నుండి తిరుమల శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పణ

Satyam News

తెలంగాణ రీసైక్లింగ్ సర్వీస్: పాత పేరు.. కొత్త ప్యాకింగ్!

Satyam News

అమెరికా ఇరాన్ అవగాహనను స్వాగతించిన భారత్

Satyam News

Leave a Comment